జననేత కరచాలనం కోసం...
● జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, వృద్ధులు, యువకులు, విద్యార్థులు అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల వారూ పోటీ పడ్డారు. గోడలు, గేట్లు గెంతారు.
● జగనన్నను చూసేందుకు పాలకొండ రోడ్డులో దారి పొడవునా జనం వేచిచూశారు. ఇళ్ల డాబాపైకి ఎక్కి ఆశగా చూశారు.
● అభిమానులు అడుగడుగునా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.
● మధ్యాహ్నం 2 గంటల సమయంలో జగన్‌మోహన్ రెడ్డి పాలకొండ చేరుకున్నారు. సాయంత్రం 4.15 నిమిషాలకు తిరుగు ప్రయాణమయ్యారు.
● పట్టణంలో పలువురు చిన్నారులను ఆయన దగ్గరకు తీసుకోవడంతో తల్లిదండ్రులు మురిసిపోయారు.
● క్యాన్సర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల కుమారుడి కష్టాన్ని పాలకొండకు చెందిన ముదిల జ్యోతి జగన్‌మోహన్‌రెడ్డికి వివరించగా.. చిన్నారి ఆరోగ్య బాధ్యతను మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు.
సైలెన్సర్ల ధ్వంసం
విజయనగరం క్రైమ్: వాహనాలకు పెద్ద శబ్దాలు వచ్చేలా సైలెన్స్‌ర్లను ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ట్రాన్స్ పోర్ట్, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి బాలాజీ జంక్షన్ వద్ద దాదాపు 300 సైలెన్స్‌ర్లను రోడ్డురోలర్‌తో గురువారం ధ్వంసం చేయించారు. అధిక శబ్దం వచ్చేలా సైలెన్స్‌ర్లను ఏర్పాటుచేసిన వాహనచోదకుల నుంచి రూ.వెయ్యి నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మణికుమార్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సూరినాయుడు, ఎస్‌ఐలు భాస్కరరావు, నూకరాజు, రవి, మురళీ, లక్ష్మీప్రసన్నకుమార్, సురేంద్ర నాయుడు, రేవతి తదితరులు పాల్గొన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై విస్తృత ప్రచారం
విజయనగరం అర్బన్: ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మొబైల్‌లో ఇంటి వద్ద నుంచి అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలు పొందేందుకు వీలుగా రూపొందించిన వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం 95523 00009 వాట్సప్ నంబర్ ద్వారా 158 రకాల ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాలు అందజేస్తున్నామని, రానున్న రోజుల్లో వెయ్యి సేవలు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో అత్యంత నిరుపేదల గుర్తింపుకోసం మార్చి 8 నుంచి సర్వే చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. మార్చి 6న జిల్లా అధికారులతో దీనిపై సమావేశం నిర్వహిస్తామని, మార్చి 7న మండల స్థాయిలో ఎంపీడీఓల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పిస్తామని చెప్పారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఏఆర్వోలను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన జరగ నున్న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఎన్నిక నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఏఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
జననేత కరచాలనం కోసం...
జననేత కరచాలనం కోసం...
Comments
Please login to add a commentAdd a comment