నాటిక పోటీలు ప్రారంభం
నెల్లిమర్ల: జరజాపుపేటలోని నల్లి సూరిబాబు స్మారక కళాప్రాంగణంలో ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పరిషత్ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రదర్శించిన రైతే రాజు, ఎడారిలో వాన చినుకు నాటికలు ఆహూతులను ఆలోచింపజేశాయి. ప్రారంభోత్సవంలో పాల్గొన్న కూటమి నాయకులు సీహెచ్ వెంకటరమణ, ఎస్.రవిశేఖర్ మాట్లాడుతూ రంగస్థల నటుడు ఆరిపాక బ్రహ్మానందం కళారంగానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. కళలకు కాణాచి అయిన జరజాపుపేటలో నాటక పరిషత్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆరిపాక శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాకారులు ఈపు విజయ్ కుమార్, అవనాపు సత్యనారాయణ, లెంక అప్పలనాయుడు, ఆరిపాక రాము, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment