అందరికీ అందుబాటులో ఉంటా
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్‌సీపీ శ్రేణులందరికీ తాను అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి సమస్య ఉందని చెప్పినా స్పందిస్తానని భరోసానిచ్చారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తనను నోటికి వచ్చినట్టు తిట్టిన వారితోనే చంద్రబాబు జతకట్టి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అప్పట్లో టీడీపీకి అభ్యర్థులే దొరకలేదని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ పూటకో విషయం మాట్లాడతారని, 9 నెలలు తిరగకముందే ప్రభుత్వంపై జనం ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో కూటమి మద్దతిచ్చిన అభ్యర్థి రఘువర్మ ఓడిపోవడంతో ఆయన తమ పార్టీ అభ్యర్థి కాదనడం టీడీపీకి సిగ్గుచేటన్నారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే దమ్మున్న వ్యక్తి జగన్ అని తెలిపారు. పార్టీని స్థాపించిన వారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని, కూటమి నేతలకు భయపడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పతనం ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభమైందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి టీడీపీ నాయకులకు ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీనాయకులు పలువురు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్
కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు
Comments
Please login to add a commentAdd a comment