జాతీయ జెండాకు అవమానం
విజయనగరం: విజయనగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. సిద్ధాంతాలకు పేటెంట్ మా నాయకుడు అని చెప్పుకుని తిరిగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ కార్యాలయంలోనే జాతీయ పతాకాన్ని అవమానకర రీతిలో మూలనపడేయడమే కాకుండా జెండాపై తాగిన టీ కప్పులు వేయడం ఘోర తప్పిదమని కార్యాలయానికి విచ్చేసిన పలువురు పేర్కొన్నారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు పాలవలస యశస్వి, పడాల అరుణ, గురాన అయ్యలు మంగళవారం విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న బీరువా పక్కన జాతీయ పతాకాన్ని మూలనపడేసి ఉన్న విషయాన్ని అక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలు చూడడమే కాకుండా వాటిపై తాగిన టీ కప్పును పడేయడం అవమానకరమని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించిన జనసేన నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
జనసేన కార్యాలయంలో మూలన పడేసిన జెండాపై తాగి పడేసిన టీ గ్లాసులు
Comments
Please login to add a commentAdd a comment