వేతన వ్యత్యాసాలు లేకుండా చూడాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ సిబ్బందికి వేతన సదుపాయా లు కల్పించాలని ఆర్టీసీ ఎన్‌ఎంయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.రాజేష్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జోనల్ మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. నైట్ అవుట్ అలవెన్స్‌లు, పెన్షన్, పీఎఫ్ అధికంగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. 1/2019 సర్క్యులర్‌ను తిరిగి యథాతథంగా అమలుచేయాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పీవీవీ మోహన్, జోనల్ కమిటీకి నూతనంగా ఎన్నికై న బీఎస్ రాములు, జోనల్ అధ్యక్ష కార్యదర్శులు ప్రదీప్ కుమార్, ఎంవీఆర్ మూర్తి, జిల్లా కార్యదర్శి పీజీ రాఫిల్, జోన్ పరిధిలోని 18 డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, మహిళాఉద్యోగులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎన్‌ఎంయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్‌కుమార్
వేతన వ్యత్యాసాలు లేకుండా చూడాలి
Comments
Please login to add a commentAdd a comment