
పవర్ లిఫ్టింగ్‌లో కల్యాణి ప్రతిభ
చీపురుపల్లి: పవర్‌లిఫ్టింగ్ బ్రెంచ్ ప్రెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పట్టణానికి చెందిన సాకేటి రేణుక కల్యాణి ఉత్తమ ప్రతిభ కనపరిచింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో రేణుక కల్యాణి మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో కోచ్ గంగాధర్ ఆమెను అభినందించారు. ఈ నెల 11 నుంచి 13 వరకు కృష్ణా జిల్లాలోని గుడివాడలో గల ఎన్‌టీఆర్ ఇండోర్ స్టేడియంలో 12వ ఏపీ స్టేట్ కాస్లిక్ పవర్ లిఫ్టింగ్, బ్రెంచ్ ప్రెస్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 84 ప్లస్ కేజీల పవర్ లిఫ్టింగ్ పోటీల విభాగంలో పాల్గొన్న రేణుక కల్యాణి రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది. అలాగే బ్రెంచ్ ప్రెస్ విభాగంలో రజత పతకం సాధించింది.