
సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశం
● కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో 330 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం డివిజన్‌లో 180, బొబ్బిలి డివిజన్‌లో 60, చీపురపల్లి డివిజన్‌లో 90 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. గతంతో పోలిస్తే హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య తగ్గిందన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తించి, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెలాఖరులోగా జిల్లాకు అవసరమైన డ్రోన్లను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు డి.కీర్తి, సత్యవాణి, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
రైల్వే మూడోలైన్ భూముల పరిశీలన
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని గరివిడి, దువ్వాం, తోండ్రంగి, కొండలక్ష్మీపురం, కొండశంబాం, చుక్కవలస గ్రామాల మీదుగా ఏర్పాటుచేయనున్న రైల్వే మూడోలైన్‌కు అవసరమైన భూములను జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ బుధవారం పరిశీలించారు. రైల్వేలైన్ ఏర్పాటులో అడ్డుంకులపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గరివిడి మండలంలోని కొండలక్ష్మీపురం రైల్వేగేటు వద్ద ఏర్పాటు చేయనున్న రైల్వే వంతెన(ఆర్‌ఓబీ) వల్ల ఎదురయ్యే సమస్యలపై గ్రామస్తులు ఇటీవల జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆర్‌ఓబీ నిర్మాణంతో గ్రామానికి, గ్రామంలో ఉండే ఇళ్లకు ఎంతవరకు నష్టం జరగనుందన్న అంశాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బి.సురేష్, మండల సర్వేయర్ నాగమణి, తదతరులు పాల్గొన్నారు.
దాసరికి కందుకూరి
వీరేశలింగం పురస్కారం
విజయనగరం టౌన్: సీనియర్ రంగస్థల నటుడు, మూవీ ఆర్టిస్ట్, నందిఅవార్డు గ్రహీత దాసరి తిరుపతినాయుడుకు విశిష్ట కందుకూరి వీరేశలింగం పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్రం, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ, ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా తెలుగు నాటకరంగ దినోత్సవం–2025ను పురస్కరించుకుని కందుకూరి పురస్కారాలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి ప్రదానం చేశాయి. పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా దాసరి అందుకన్నారు.
తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
విజయనగరం ఫోర్ట్: తల్లీబిడ్డల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం సీ్త్ర, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల, బాలికల ఆరోగ్యంపై అన్ని శాఖలు దృష్టి సారించాలన్నారు. చక్కని పౌష్టికాహారం అందించడంతో పాటు, వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయాలని, తల్లులకు ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న 69,000 మంది చిన్నారుల్లో 4 వేల మంది బరువు తక్కువగా ఉన్నట్టు నివేదికలు తెలియజేస్తున్నాయని, వారికి పౌష్టికాహారం అందించి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దాలన్నారు. 7 వేల మంది మరుగుజ్జు పిల్లలు ఉన్నారని, ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువేనన్నారు. సమావేశంలో ఐటీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా భేగం, డీఈఓ మాణిక్యంనాయుడు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత పాల్గొన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశం

సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశం