
1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస రూరల్: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని చినమేరంగి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరాలపై గురువారం నిర్వహించిన దాడుల్లో 18 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 1800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు సీఐ వీవీఎస్ శేఖర్‌బాబు, కురుపాం ఎకై ్సజ్ ఎస్సైలు రాజశేఖర్, చంద్రకాంత్‌లు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ దాడుల్లో 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సారా స్థావరాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు వారికి ముడిసరుకు సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నిర్ధారణ అయితే వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
వెయ్యిలీటర్ల సారా ఊటలు ధ్వంసం
భామిని: మండలంలోని కొత్తగూడలో గురువారం సారా అమ్మకం దారులపై దాడులు జరిపి 40లీటర్ల సారాతో ఇద్దరు అమ్మకం దారులు బిడ్డిక రవి, బిడ్డిక కొండలరావులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఏఈఎస్ ఏఎస్,దొర ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే దాడిలో వెయ్యి లీటర్ల సారా ఊటలు ధ్వంసం చేసి సారా తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పాలకొండ ఎకై ్సజ్ సీఐ కె.సూర్యకుమారి సారథ్యంలో నవోదయం 2 కిం సారా నిర్మూలనలో భాగంగా సారా తయారీకి బెల్లం అందిస్తున్న ఘనసరకు చెందిన భూపతి షణ్ముఖపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. దాడుల్లో పాలకొండ సీఐ సూర్యకుమారితో పాటు మొబైల్ సీఐ మురళి, కొత్తూరు సీఐ కిరణ్మయి, పి.లీలారాణి, పాలకొండ ఎస్సై కొండలరావు, సిబ్బంది పాల్గొన్నారు.

1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం