
ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు
–10లో
1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
చినమేరంగి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీ సులు దాడులు చేశారు. 1800 లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు.
విజయనగరం అర్బన్: జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. విజయనగరం నియోజకవర్గం కొండకరకాంలో 12 ఎకరాలు, నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం మోదవలసలో 19.8 ఎకరాలు, గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కొండకిండాంలో 57 ఎకరాలు, రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలం సంకిలిలో 20 ఎకరాలు, బొబ్బిలి నియోజవర్గం రామభద్రపురం మండలం కొట్టక్కిలో 100 ఎకరాలు, చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కుమరాంలోని 10 ఎకరాలు, ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం బలిఘట్టంలోని 57 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విజయవాడ ఏపీ సచివాలయంలో సీఎస్ సమావేశ మందిరం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజి ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీరు సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్‌ఎంఈ సర్వే, నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర, తదితర అంశాలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అంబేడ్కర్, జేసీ ఎస్.సేతుమాధవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్