![తల్లి](/styles/webp/s3/article_images/2025/02/16/0000635555-000001-svshospital_mr-1739646699-0.jpg.webp?itok=y0Hgs6lw)
తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి
వనపర్తి విద్యావిభాగం: పదోతరగతి విద్యార్థులు ఇంటి దగ్గర చదువుకునేలా తల్లిదండ్రులు అనువైన వాతావరణం, సౌకర్యాలు కల్పించాలని జిల్లా విద్యాశాఖ కమిటీ మొబిలైజేషన్ కో–ఆర్డినేటర్ యుగంధర్ కోరారు. శనివారం ఆయన మండలంలోని రాజపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తకోటలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశాలకు ఆయన హాజరయ్యారు. 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలు రోజు ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలని కోరారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున పౌష్టికాహారం అందించి వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
![తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి
1](/gallery_images/2025/02/16/15wnp51-210165_mr-1739646699-1.jpg)
తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి
Comments
Please login to add a commentAdd a comment