అత్తామామ నుంచి కోతులు పట్టడం నేర్చుకున్న..
అత్తామామ దేవస్తాన్, హంసలేఖ 20 ఏళ్లుగా కోతులు పడుతూ ఉపాధి పొందుతున్నారు. తిరుపతి పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల్లో కోతులు పడుతుండేవారు. అయితే, కరోనా సమయంలో ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారం దెబ్బతినడంతో నాకు కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మా అత్తామామతో కొత్తగూడెం పట్టణానికి వచ్చి 10 రోజులపాటు కోతులు పట్టడం నేర్చుకున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో కోతులు పట్టేందుకు మాకు పిలుపు వచ్చింది. మేం కోతులు పడుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు యూట్యూబ్‌లో నిక్షిప్తం చేయడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఇలా మాకు తెలంగాణలోని వివిధ గ్రామాల నుంచి కోతులు పట్టేందుకు ఫోన్లు వస్తున్నాయి. – దినేశ్, తిరుపతి వాసి
Comments
Please login to add a commentAdd a comment