జోరుగా గంజాయి దందా ● యువతే టార్గెట్‌గా బిజినెస్‌ ● విచ్చలవిడిగా విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

జోరుగా గంజాయి దందా ● యువతే టార్గెట్‌గా బిజినెస్‌ ● విచ్చలవిడిగా విక్రయాలు

Published Fri, Nov 22 2024 1:04 AM | Last Updated on Fri, Nov 22 2024 1:04 AM

జోరుగ

జోరుగా గంజాయి దందా ● యువతే టార్గెట్‌గా బిజినెస్‌ ● విచ్

రెండు కమిషనరేట్లు, నాలుగు జిల్లాలకు కేంద్రంగా నగరం డబ్ల్యూఎన్‌పీఎస్‌ ఏర్పాటుతో భరోసా..

నవంబర్‌ 8న వరంగల్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో 48 కిలోల గంజాయిని జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫాం–2, 3 వైపు ప్లాస్టిక్‌ సంచులు, బుట్టలతో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని తనిఖీ చేయగా.. గుట్టురట్టయ్యింది. ఒడిశాలోని గంజాం జిల్లా తలపాడు గ్రామానికి చెందిన బాబిత కుమారి పాణిగ్రహి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తుండగా.. గంజాయి లభ్యమైంది.

‘పుష్ప’ సినిమా తరహాలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొందరు ఒడిశాలోని నాటుగురులో 338 కిలోల గంజాయి కొని 96 ప్యాకెట్లుగా మార్చి ట్రాక్టర్‌ ట్రాలీ కింద భద్రపర్చి వరంగల్‌ నుంచి కామారెడ్డికి సెప్టెంబర్‌ 21న తరలిస్తుండగా.. హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌ వద్ద యాంటీ డ్రగ్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

సెప్టెంబర్‌ 28న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రెవెన్యూ ఉద్యోగి మరిపెడ నుంచి హైదరాబాద్‌కు కారులో గంజాయి తరలిస్తూ గాలివారిగూడెం సమీపంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అందులో రూ.31.75 లక్షల విలువైన 127 కిలోల ఎండు గంజాయి లభించింది.

ఆగస్టు 28న సుబేదారి పోలీసులు హనుమకొండ అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మంగపేట మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రూ.23 వేల విలువైన 880 గ్రాముల

గంజాయితో పట్టుబడ్డారు.

వరంగల్‌ జిల్లా ఖానాపురం, చెన్నారావుపేటకు చెందిన ముగ్గురు యువకులు హనుమకొండలోని పెగడపల్లి డబ్బాల సమీపంలో గంజాయి సేవిస్తూ ఇటీవల కేయూసీ పోలీసులకు పట్టుబడ్డారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

హైదరాబాద్‌ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ను తమ వ్యాపారానికి కేంద్రంగా మార్చుకున్నారు గంజాయి విక్రయదారులు. కొత్త పంథాలో, సరికొత్త ఎత్తుగడలతో గంజాయిని తరలిస్తూ, విక్రయిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలతో చెక్‌ పెడుతున్నప్పటికీ.. మూడు దమ్ములు.. ఆరు కిక్కులు అన్నట్లుగా ఉమ్మడి జిల్లాలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈజీ మనీ కోసం కొందరు ముఠాగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నారు. విశాఖపట్నం, ఒడిశా నుంచి వరంగల్‌ మీదుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్న ముఠా.. నగరంలోనూ ఏజెంట్లను నియమించుకుని గంజాయి విక్రయిస్తోంది. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ నార్కోటిక్స్‌ పోలీస్‌ స్టేషన్‌ (డబ్ల్యూఎన్‌పీఎస్‌)ను మంగళవారం ప్రారంభించారు. ఈనేపథ్యంలో వరంగల్‌ను డ్రగ్స్‌ ఫ్రీ కేంద్రంగా మార్చేందుకు మరింత సీరియస్‌గా చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

స్కూల్‌ స్థాయి నుంచే..

యువతతో పాటు కొందరు స్కూల్‌ స్థాయి నుంచే గంజాయి వినియోగిస్తున్నారు. రాత్రి సమయంలో కాజీపేట, వరంగల్‌ రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతా లు, వరంగల్‌, హనుమకొండ బస్‌స్టేషన్‌ ఆవరణ లు, వరంగల్‌లోని ఉర్సు గుట్ట, చిన్నవడ్డేపల్లి చెరు వు, రంగశాయిపేట బెస్తం చెరువు, ఖిలావరంగల్‌ గుండు చెరువు, రాతికోట, ఏనుమాముల మార్కెట్‌ శివారు, కాకతీయ కెనాల్‌ ప్రాంతాలు, హనుమకొండలోని బంధం చెరువు, న్యూశాయంపేట రైల్వే ట్రా క్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పలివేల్పుల, వడ్డేపల్లి చెరువు కట్ట, హాస్టళ్లు, అద్దె గదులను అడ్డాగా చేసుకొని విద్యార్థులు బృందాలుగా ఏర్పడి గంజాయి తాగుతున్నారు. ఇటీవల అమ్మాయిలు సైతం గంజాయికి అలవాటు పడుతున్నట్లు తెలిసింది.

కట్టడి చేసేందుకు డబ్ల్యూఎన్‌పీఎస్‌..

డ్రగ్స్‌ను కంట్రోల్‌ చేసేందుకు వరంగల్‌ నార్కోటిక్స్‌ పోలీస్ట్‌ స్టేషన్‌ (డబ్ల్యూఎన్‌పీఎస్‌)ను ఏర్పాటు చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌, ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్లతోపాటు మహబూబాబాద్‌, జేఎస్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఇక్కడే హెడ్‌క్వార్టర్‌గా డీఎస్‌పీ నేతృత్వంలో పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు రూ.88 కోట్ల విలువైన 35,319 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 389 కేసులు నమోదు చేసినట్లు అధికారులు డబ్ల్యూఎన్‌పీఎస్‌ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు.

డిస్‌పోస్డ్‌ డ్రగ్‌

(కిలోల్లో)

పట్టుబడిన గంజాయి, కేసులు, విలువ

విలువ

(రూ.కోట్లలో)

యూనిట్‌ కేసుల డిస్‌పోస్డ్‌ డ్రగ్‌ విలువ

సంఖ్య (కిలోల్లో) (రూ.కోట్లలో)

వరంగల్‌ 21 1,245.439 3.07

మహబూబాబాద్‌ 24 515 1.29

జేఎస్‌ భూపాలపల్లి 25 636.39 1.59

ఖమ్మం 48 853.577 1.96

భద్రాద్రి కొత్తగూడెం 271 32,069.181 80.17

35,319.587

88.08

రవాణా మార్గాలివే..

గంజాయిని ప్రధానంగా ఏడు మార్గాల ద్వారా వయా వరంగల్‌, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిత్రకొండ, సీలేరు, డోర్నకల్‌, మోతుగూడెం, చింతూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం నుంచి వరంగల్‌ ఒక మార్గం, చిత్రకొండ, సీలేరు, డోర్నకల్‌, మోతుగూడెం, లక్నవరం ఎక్స్‌ రోడ్‌, రాజమండ్రి మరోమార్గం. కలిమెల, కుంట (ఛత్తీస్‌గఢ్‌), చెట్టి (చింతూరు), భద్రాచలం మరోమార్గం. భద్రాచలం, వెంకటాపురం, ములుగు, పస్రా, తాడ్వాయి, వరంగల్‌, హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున గంజాయి తరలుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదో రూటు రాజమండ్రి, అశ్వారావుపేట, కల్లూరు, తల్లాడ, ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌ కాగా.. పాడేరు, జి మాడ్గుల, చోడవరం, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్‌కు గంజాయి తరలుతోంది. అలాగే చింతపల్లి, లంబసింగి, నర్సీపట్నం, కోటనందూరు, తుని, జగ్గంపేట, రామచంద్రాపురం, చింతూరు, గుండాల, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, జనగామ, హైదరాబాద్‌కు వెళ్తుండగా.. ఇదేదారిలో జనగామ నుంచి వరంగల్‌కు చేరుతుంది. అరకు, ఎస్‌.కోట, దేవరపల్లి, పెందుర్తి, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, కోదాడ నుంచి వరంగల్‌, హైదరాబాద్‌కు.. వరంగల్‌ నుంచి మహారాష్ట్ర వివిధ మార్గాల ద్వారా గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

మొత్తం

కేసులు

389

No comments yet. Be the first to comment!
Add a comment
జోరుగా గంజాయి దందా ● యువతే టార్గెట్‌గా బిజినెస్‌ ● విచ్1
1/2

జోరుగా గంజాయి దందా ● యువతే టార్గెట్‌గా బిజినెస్‌ ● విచ్

జోరుగా గంజాయి దందా ● యువతే టార్గెట్‌గా బిజినెస్‌ ● విచ్2
2/2

జోరుగా గంజాయి దందా ● యువతే టార్గెట్‌గా బిజినెస్‌ ● విచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement