సేవాలాల్ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య
హన్మకొండ: సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని శనివారం హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, ప్రొఫెసర్ వీరన్ననాయక్, హనుమకొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీస ర్ రమేశ్‌రాథోడ్, సేవాలాల్ జయంతి ఉత్సవ కమి టీ బాధ్యులు నవీన్‌నాయక్, జైసింగ్ రాథోడ్, పోరిక ఈశ్వర్‌సింగ్, చిన్నబాబు, ధరావత్ రాంచంద్రనాయక్, ఉదయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి, అడవు ల సంరక్షణ, అన్ని సామాజిక వర్గాల సమానత్వం కోసం సంత్ సేవాలాల్ కృషి చేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. వరంగల్ వెస్ట్, పరకాల నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసుకుని సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. బోగ్ బండారో, పూ జా కార్యక్రమాల్లో కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు భావుసింగ్, శ్రీపాల్‌రెడ్డి, గిరిజన నాయకులు, బంజారా మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment