ఎల్కతుర్తి: హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని డాక్టర్ పీవీ రంగారావు తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం సాయంత్రం కలెక్టర్ పి.ప్రావీణ్య సందర్శించారు. పాఠశాల, కళాశాలలోని గదులు కలియదిరిగి పరిశీలించారు. డార్మెటరీ, వంట గదులు తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరైన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల, కళాశాలలో రూ.24 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకుల పాఠశాల, కళాశాలలో టాయిలెట్ల మరమ్మతులు చేయించాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయని, వాటి పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారిని నియమించినట్లు వెల్లడించారు. అధికారులు హాస్టల్‌ను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలు తన దృష్టికి తెస్తున్నట్లు తెలిపారు. వంగర పాఠశాల పీఎంశ్రీ పథకం కింద ఎంపికై ందని, ఈ పథకం కింద మంజూరైన నిధులతో అదనపు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వారితో కలిసి నిద్ర (బస) చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వాసంతి, అడిషినల్ డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, ఎంపీడీఓ వీరేశం, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంఈఓ సునీత, పంచాయతీరాజ్ ఏఈ వినయ్‌రెడ్డి, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య వంగరలోని గురుకుల పాఠశాల పరిశీలన.. రాత్రినిద్ర
Comments
Please login to add a commentAdd a comment