మార్చి 31 వరకు ఎన్‌సీడీ స్క్రీనింగ్
గీసుకొండ: అసంక్రమిత వ్యాధుల (ఎన్‌డీసీ) నిర్ధారణకు ఎన్‌సీడీ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మార్చి 31 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా స్క్రీనింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. హైపర్ టెన్షన్ కోసం 3,982 మందికి పరీక్షలు చేయగా 20 మందికి, 3701 మందికి మధుమేహం పరీక్షలు చేయగా 14 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు గుర్తించామని వివరించారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, పల్లె, పట్టణ దవాఖానల వైద్యులు, సిబ్బంది, ప్రోగ్రాం అధికారులు వంద శాతం స్క్రీనింగ్ పూర్తిచేయాలని సూచించారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్, కోఆర్డినేటర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి సాంబశివరావు పేర్కొన్నారు.
డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
Comments
Please login to add a commentAdd a comment