ప్రణాళికలు సిద్ధం చేయండి
హన్మకొండ అర్బన్: జిల్లాలో మహిళా సాధికారత దిశగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం, ఉత్పత్తి తయారీ యూనిట్‌ను ప్రణాళికతో రూపొందించాలని ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ (వీహబ్) ప్రతినిధులకు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జిల్లాలోని ల్యాదెళ్లలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను శుక్రవారం ఉదయం వీ హబ్ ప్రతినిధులు, ఇతర అధికారులు సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో వారు సమావేశమయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి, ఉత్పత్తి తయారీకి సంబంధించిన వార్షిక ప్రణాళికను సమన్వయంతో రూపొందించాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలన్నారు. పరకాల నియోజకవర్గ పరిధి మహిళా గ్రూపులకు ఏయే అంశాల్లో శిక్షణను నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మహిళా సాధికారతకు చేయూతనందించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి కేంద్రంలో మహిళలకు జ్యూట్ బ్యాగ్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, వీ హబ్ డైరెక్టర్ జాహిద్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి..
విద్యారణ్యపురి: ఇష్టపడి చదివితే భవిష్యత్‌లో దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థల్లో చదివే అవకాశం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లాలోని పీఎం శ్రీ స్కూల్స్ విద్యార్థులు ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్‌లో భాగంగా వరంగల్ నిట్‌ను సందర్శించారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలైన వరంగల్ నిట్‌లోని సాంకేతికత, సాంకేతికేతర విభాగాలను, వివిధ ప్రాజెక్టులను పీఎం శ్రీ స్కూల్ విద్యార్థులు సందర్శించి నిట్ ఆచార్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీఈఓ డి.వాసంతి, వరంగల్ నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఆచార్య శ్రీనివాసాచార్య, నెహ్రూ యువ కేంద్ర జిల్లా కో–ఆర్డినేటర్ అన్వేశ్ ఉన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
Comments
Please login to add a commentAdd a comment