దేవుడు దూరం చేసిండు!
ఆసరా అయితారనుకుంటే..
నడికూడ : ఎదిగిన కొడుకులు ఆసరా అయితారునుకున్నాం.. దేవుడు మా బిడ్డలను దూరం చేసిండంటూ తల్లిదండ్రులు రోదించిన తీరును చూసిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టుకున్నారు. మండలంలోని కంఠాత్మకూర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని అన్నదమ్ములు మృతి చెందారు. దామెర పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం గ్రామానికి చెందిన ఉప్పుల చంద్రానికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజ్‌కుమార్ (25) హనుమకొండలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. చిన్న కొడుకు శంకర్ (22) ఐటీఐ చదువుతున్నాడు. గురువారం రాత్రి అన్నదమ్ములతో పాటు, వారి స్నేహితుడు కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బండారి శివకుమార్ ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో కంఠాత్మకూర్ హనుమాన్ గుడి వద్ద వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా, శంకర్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. తీవ్ర గాయాలతో శివకుమార్ చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలిని పరకాల రూరల్ సీఐ రంజిత్‌రావు పరిశీలించారు. మృతుల తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దామెర ఎస్సై కొంక అశోక్ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల
దుర్మరణం
గుండెలవిసేలా రోదించిన
తల్లిదండ్రులు, బంధువులు
దేవుడు దూరం చేసిండు!
Comments
Please login to add a commentAdd a comment