
నేడు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష
మడికొండ: తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆదివారం(నేడు) నిర్వహించనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కో–ఆర్డినేటర్, మడికొండ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా పరి ధిలో 16 సెంటర్లు కేటాయించగా.. 5వ తరగతి లో 2548, 6వ తరగతిలో 895, 7వ తరగతిలో 451, 8వ తరగతిలో 329, 9వ తరగతిలో 286 మొత్తం 4,509 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు.
పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో పీజీ కోర్సుల(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ) మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) మార్చి 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 3, 5, 7, 10, 12,15 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
మహా రుద్రయాగం ప్రారంభం
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం దేవాలయంలోని భద్రేశ్వరుడి ఆలయంలో అర్చకులు మహా రుద్రయాగం, గ్రహముఖం, శ్రీరుద్రపురశ్చరణ, శివపంచాక్షరి, జపహోమార్చనాభిషేకాలు నిర్వహించారు.
నేటి నుంచి సహృదయ
ఆహ్వాన నాటక పోటీలు
హన్మకొండ కల్చరల్: వరంగల్ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నేటి(ఆదివారం) నుంచి నాలుగు రోజులు తెలుగు భాష ఆహ్వాన నాటక పోటీలు నిర్వహించనున్నారు. బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ఈపోటీలు ప్రారంభం కానున్నాయి.
నేడు ఆర్‌ఎస్‌ఎస్
మహానగర సాంఘిక్
కేయూ క్యాంపస్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వరంగల్ మహానగర్ ఆధ్వర్యంలో ఈనెల 23న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఉదయం 7:15 గంటల నుంచి 8:30 గంటల వరకు మహానగర్ శాఖల సాంఘిక్ నిర్వహించనున్నారు. ఈమేరకు ఆకళాశాల మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రాంత కార్యవాహ (సెక్రటరీ) కాచం రమేశ్ వక్తగా హాజరై స్వయం సేవకులకు మార్గనిర్దేశనం చేస్తారు. వరంగల్ మహానగర్ ఆర్‌ఎస్‌ఎస్ సంచాలకులు డాక్టర్ బందెల మోహన్‌రావు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment