
శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు
ఐనవోలు: ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా కల్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 28వ తేదీ వరకు ఐదురోజుల పాటు ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యాన వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్..
● 24న ఉదయం 8 గంటలకు సూర్య ప్రభ వాహన సేవ, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, దీక్షాధారణ, అఖండ దీప స్థాపన, సాయంత్రం అంకురార్పణ, అగ్ని మదన–అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, బలిహరణ కార్యక్రమాలు, రాత్రి చంద్ర ప్రభ వాహనసేవ ఉంటుంది.
● 25న ఉదయం అశ్వ వాహనసేవ, రాత్రి శేషవాహన సేవ, గవ్యాంత పూజలు, వాస్తు పూజ, పర్యగ్నికరణ రుద్ర హోమం, ప్రాతరౌపాసన, అష్టోత్తర శత(108) కలశార్చన, మహాన్యాస పూర్వక మహారుద్రం కార్యక్రమాలు ఉంటాయి.
● 26న మహాశివరాత్రి. ఉదయం సింహ వాహన సేవ, రాత్రి నంది వాహనసేవతో పాటు అర్ధరాత్రి లింగోధ్భవ కాలంలో అష్టోత్తర శత(108) కలశాలచే విశేష మహాభిషేకం, పెద్దపట్నం, భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కల్యాణం ఉంటుంది.
● 27న ఉదయం రావణ వాహన సేవ, సాయంత్రం రథోత్సవం పురవీధి సేవ, రథాంగ హోమం ఉంటాయి.
● 28న ఉదయం పర్వత వాహన సేవ, గవ్యాంత పూజలు, రుద్ర, చండీ హోమం, మృగయాత్ర, ధ్వజ అవరోహణ, నిత్యౌపాసన, బలిహరణ, పూర్ణాహుతి, చూర్మోత్స వం, వసంతోత్సవం, త్రిశూల స్నానం, అవబృదుతో పాటు రాత్రికి పవళింపు సేవ, పుష్పోత్సవం, ఏకాంత సేవ, పండిత ఆశీర్వచనం, పండిత సన్మానాది కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
వాహన సేవల్లో పాల్గొనే వారు దేవస్థానం కార్యాలయంలో రూ.516 చెల్లించి రశీదు పొందాలని, శివరాత్రి ఉత్సవాల 5 రోజులు దాతల సహకారంతో మహా అన్నదానం ఉంటుందని ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు.
మల్లన్న ఆలయంలో రేపు ప్రారంభం
ఐదు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment