
అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఉప్పల్ ఉపాధ్యాయుడు
కమలాపూర్: విద్యారంగంలో ఆంగ్ల భాష పరిచయం, బోధనలో అనుసరించాల్సిన నూతన పద్ధతులపై దక్షిణాసియా దేశాల అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో కమలాపూర్ మండలం ఉప్పల్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు కొక్కుల సంపత్‌కుమార్ పాల్గొన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యాన ఢిల్లీలో జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో సంపత్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘న్యూ డైరెక్షన్ ఆఫ్ సౌత్ ఏసియా టెక్నాలజీ అండ్ ట్రెడిషన్, ది చేంజింగ్ ఫేస్ ఆఫ్ అసెస్‌మెంట్ ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్స్’ అంశంపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిశోధకులు పత్రాలు సమర్పించారు. మొదటిసారి ఇండియాలో జరిగిన ఈ సమావేశంలో ఇంగ్లిష్ ఫర్ ఎంప్లాయ్‌బిలిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇంగ్లిష్ ఎడ్యుకేషన్, అసెస్సింగ్ యంగ్ లెర్నర్స్, ద రోల్ ఆఫ్ ఇంగ్లిష్ ఇన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ కాంటాక్ట్స్’ అనే అంశాలపై చర్చించినట్లు సంపత్‌కుమార్ పేర్కొన్నారు. కాన్ఫరెన్స్‌లో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment