వరంగల్ అర్బన్: ఆస్తి, నీటి పన్నుపై బల్దియా అధికారులు శ్రద్ధ కనబర్చడం లేదని తెలుస్తోంది. కొత్త ఇంటి నంబరు, ఆస్తి పేరు మార్పిడి, విభజన ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. పదిన్నర నెలలుగా అధికారులు చేపట్టిన పన్ను వసూళ్లు చూస్తే వారి పనితీరు, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. 2024–25 సంవత్సరానికి రూ.117.31 కోట్లు పన్ను వసూలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు పదినెలలు దాటినా రూ.50.31 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
పన్నుల లక్ష్యాన్ని చేధించడంలో వెనుకబడడానికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు సిబ్బంది.. అలసత్వం కూడా తోడవడంతో పన్ను వసూళ్లు ముందుకు సాగట్లేదు. మొండి బకాయిదారులను గుర్తించి వారిపై ఒత్తిడి పెంచడంలోనూ అడుగడుగునా వైఫల్యం కనిపిస్తోంది. కొత్త ఇంటి నంబర్ల కేటాయింపులు, ఆస్తుల పేరు మార్పిడి, విభజన, వీఎల్‌టీ, రీ అసెస్‌మెంట్‌పై పెడుతున్న శ్రద్ధ పన్నుల వసూళ్లపై చూపట్లేదు. కొలతల పేరుతో అందినకాడికి దండుకోవడానికి అవకాశం ఉండడంతో ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు అటువైపు మాత్రమే దృష్టి సారిస్తున్నట్లు విమర్శలున్నాయి. పన్ను బకాయిలు పెరగడానికి సక్రమంగా వసూలవకపోవడానికి యంత్రాంగం వైఫల్యమే కారణంగా చెప్పవచ్చు.
2024–25
డిమాండ్
రూ.41.54 కోట్లు,
వసూళ్లు రూ.7.68 కోట్లు
పాత బకాయిలు
రూ.25.32 కోట్లు, వసూళ్లు
రూ.4.38 కోట్లు
వసూలు చేయాల్సిన బకాయిలు
రూ.54.80 కోట్లు
18.05% వసూళ్లు
1,77,841
లోపమెవరిది?
బల్దియాలో ఇలా..
మొత్తం అసెస్‌మెంట్లు 2,17,615
Comments
Please login to add a commentAdd a comment