మత్తు పదార్థాలను నియంత్రించాలి
వరంగల్: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్‌తో కలిసి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలోని 16 పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన, చైతన్యం కల్పిస్తే సమాజంలో మార్పు తీసుకురావొ చ్చని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల్లో మత్తుపదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీసీపీ రవీందర్ మాట్లాడుతూ ప్రతి నెల నార్కోటి క్స్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలి పారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చందర్, ఎఫ్‌ఆర్‌ఓ సందీప్, నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మార్చి 17 వరకు సీఎంఆర్ పూర్తి చేయాలి
జిల్లాలో 2023–24 రబీకి సంబంధించిన సీఎంఆర్ మార్చి 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులు, మిల్లర్లతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. 2024–25 రబీ సీజన్‌లో 2 లక్షల 10వేల మెట్రిట్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉందని తెలిపారు. 2023–24 ఖరీఫ్ సీఎంఆర్ 100 శాతం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైస్‌మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ పత్రాలను తీసుకోవాలని, ప్రజా పంపిణీ బియ్యం దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఏఓ అనురాధ, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా కోఆపరేటివ్ అధికారి నీరజ, ఆర్డీఓ ఉమారాణి, మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి, జిల్లాకు పేరు తేవాలి
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కేడీ సింగ్‌బాబు స్టేడియంలో జరుగనున్న బ్‌లైండ్ పారా జోడో జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రంతోపాటు జిల్లాకు పేరు తేవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈనెల 18న హైదరాబాద్‌లో జరిగిన బ్లైండ్ పారా జోడో పోటీల్లో జిల్లా నుంచి పాల్గొని బంగారు పతకాలు సాధించి, జాతీయ పోటీలకు అర్హత పొందిన క్రీడాకారులను గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ టీవీఎల్.సత్యవాణి, జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులు జేశ్యనాథ్, రాంచరణ్, జీవన్, హరిహరణ్, శ్రీకాంత్, నాగరాజు, సతీశ్, వినోద్, గౌతం పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద
Comments
Please login to add a commentAdd a comment