సబ్‌స్టేషన్లను పటిష్టం చేయాలి
వర్ధన్నపేట: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సబ్‌స్టేషన్లను పూర్తిగా పటిష్టపరచాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఈ (ప్రాజెక్టు) భీకంసింగ్ అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట, ల్యాబర్తిలోని సబ్‌స్టేషన్లను గురువారం ఆయన సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ వర్ధన్నపేట పరిధిలో ఆరు సబ్‌స్టేషన్లు ఉండగా వర్ధన్నపేట, ల్యాబర్తి సబ్‌స్టేషన్లలో అంతర్గత పనులు పూర్తిస్థాయిలో చేపడతున్నట్లు పేర్కొన్నారు. దీంతో వచ్చే వేసవిలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏడీఈ ప్రాజెక్టు బి.రవి, వర్ధన్నపేట ఏడీఈ నటరాజ్, ఏఈ తరుణ్, విద్యుత్ సిబ్బంది ఉన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఈ భీకంసింగ్
Comments
Please login to add a commentAdd a comment