
‘ముల్కనూరు’ను సందర్శించిన శ్రీలంక ప్రతినిధులు
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని సహకార సంఘాన్ని మంగళవారం శ్రీలంక ప్రతినిధులు సందర్శించారు. శ్రీలంక కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్స్ లిమిటెడ్, వివిధ సహకార సంఘాల అధికారులు సుమారు 22 మంది పర్యటనకు వచ్చారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన వారు ముల్కనూరును సందర్శించారు. ఈ సందర్భంగా వారికి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సంఘం కార్యకలాపాలు, సంఘం అభివృద్ధి తీరును క్లుప్తంగా తెలిపారు. సంఘం సభ్యుల కుటుంబాల ఉన్నత చదువుల కోసం అందజేస్తున్న సహాయ సకారాలు, రైతులకు అందిస్తున్న బోనస్ తదితర అంశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment