టీజీఓఏ నూతన కార్యవర్గాల ఎన్నిక
హన్మకొండ అర్బన్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీఓఏ) వరంగల్, హనుమకొండ జిల్లాల నూతన కమిటీలను గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లోని టీజీఓ భవన్‌లో జరిగిన సంఘం సభ్యుల సమావేశంలో ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు ఉపేందర్‌రెడ్డి, ఈగ వెంకటేశ్వర్లు తెలిపారు. నూతనంగా ఎంపికై న వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యవర్గంచే సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్‌రావు ప్రమాణస్వీకారం చేయించినట్లు వివరించారు. ఈసందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి సభ్యులంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, సహా అధ్యక్షులు బి.శ్యామ్, ఉపాధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ జగన్‌మోహన్‌రావు, కోశాధికారి ఎం.ఉపేందర్‌రెడ్డి, దీపారెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. నూతన ఎన్నికైన రెండు జిల్లాల కార్యవర్గానికి ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.
వరంగల్ జిల్లా కార్యవర్గం
అధ్యక్షుడిగా జి.రాంరెడ్డి, అసోసియేట్ అధ్యక్షురాలిగా కె.అనురాధ, ఉపాధ్యక్షులు ఎం.చంద్రశేఖర్, బి.రాజేశ్‌రెడ్డి, ఎం.నీరజ, బి.సుధీర్‌గౌడ్, ఉపాధ్యక్షులు పి.భాగ్యలక్ష్మి, కార్యదర్శి పీఎస్ ఫణికుమార్, జాయింట్ సెక్రెటరీలు పాక శ్రీనివాసులు, కె.రాజు, సీహెచ్ యాకయ్య, బి.మధుసూదన్, ఎన్.రవీందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ కె.మధురిమ, కోశాధికారి ఈ.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.సాయిరాజ్, బి.రవి, పబ్లిసిటీ సెక్రటరీ జి.రాజేశ్‌కుమార్, వి.సదానందం, ఆఫీస్ సెక్రటరీ ఎ.రాంచందర్‌రావు, మైదం రాజు, కల్చరల్ సెక్రటరీ బి.సతీశ్‌కుమార్, పి.శ్రీకాంత్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రటరీ జి.సుధీర్‌కుమార్, ఇస్మాయిల్, ఈ సీ సభ్యులు బి.విజయనిర్మల, హేమలత, కె.ఽశ్రీధర్, శ్రీలక్ష్మి, పవిత్రను ఎన్నుకున్నారు.
హనుమకొండ జిల్లా కార్యవర్గం
అధ్యక్షుడిగా డి.మురళీధర్‌రెడ్డి, అసోసియే ట్ అధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్‌కుమార్, ఉపాధ్యక్షులు అస్నాల శ్రీనివాస్, పి.వెంకటేశ్వరరావు, ఎండీ అన్వర్, రాంకుమార్, శ్రీనివా స్‌రెడ్డి, పి.ఆంజనేయులు, సీహెచ్.ప్రవీణ్‌కుమార్, జాయింట్ సెక్రటరీ టి.మహేశ్‌కుమార్, టి.మాధవరెడ్డి, ఎం.సంతోశ్, సతీశ్‌రెడ్డి, రవిప్రసాద్, ఈ.శ్రీనివాస్‌నావు, జాయింట్ సెక్రటరీ బి.భాగ్యలక్ష్మి, కోశాధికారి పి.రాజేశ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, కె.రవీందర్, సీహెచ్ సామ్యూల్ ఆనంద్‌రావు, పబ్లిసిటీ సెక్రటరీ ఎండీ గులాం యస్దాని, నాగరాజు, ఆఫీస్ సెక్రటరీ వి.విక్రమ్, జి.వినోద్‌కుమార్, కల్చరల్ సెక్రటరీ ఎ.ఉదయ్‌కుమార్, కవిత, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రటరీ రమేశ్, ఈసీ సభ్యులు చేతన్‌రెడ్డి, వినయ్, జి.రాజేశ్వర్‌కుమార్, ఎ.కృష్ణవేణిని ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment