కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: రక్తదానమే కాకుండా హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ పాలకవర్గం అందిస్తున్న అనేక సేవా కార్యక్రమాలు అభినందనీయమని హనుమకొండ కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు ప్రావీణ్య అన్నారు. గురువారం సుబేదారి రెడ్ క్రాస్ భవన్‌లో జరిగిన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానన్నారు. ఈసందర్భంగా పాలకవర్గం కలెక్టర్‌ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయచందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ శ్రీనివాస్‌రావు, పుల్లూరు వేణుగోపాల్, శేషుమాధవ్, శ్రీనివాస్‌రావు, సుధాకర్‌రెడ్డి, సంధ్యారాణి, జయశ్రీ, రమణరెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు.
నిర్దేశిత లక్ష్యాలు పూర్తి చేయాలి
సెర్ప్ కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ శాఖ కార్యదర్శి డీఎన్ లోకేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర పంచాయతీ శాఖ కార్యదర్శి డీఎన్ లోకేశ్‌కుమార్ సెర్ప్ సీఈఓ డి.దివ్యతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి మార్కెట్ సీజన్‌లో జిల్లాలో సెర్ప్ ద్వారా ఏర్పాటు చేయనున్న ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, డీఆర్డీఓ మేన శ్రీను, పౌర సరఫరాల శాఖ అధికారి కొమరయ్య, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ మహేందర్, డీఈఓ వాసంతి తదితరులు పాల్గొన్నారు.


