సభ్యుల ఆర్థిక బలోపేతానికి కృషి..
రెండేళ్లుగా సీ్త్రనిధి రుణాల పంపిణీలో ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేశాం. క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు డీపీఎం, ఏపీఎం, సీసీలతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాం. లక్ష్యాన్ని పూర్తిచేసేలా అవసరమైన చర్యలు తీసుకున్నాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి సీ్త్రనిధి రుణాల పంపిణీ, వసూళ్లలో రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకువెళ్లాం. దీంతో ప్రభుత్వం అవార్డు అందించి సత్కరించింది. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ సభ్యుల ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తాం.
– కౌసల్యాదేవి, డీఆర్డీఓ


