భద్రకాళి అమ్మవారికి కనకాంబరాలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం కనకాంబరాలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు కనకాంబరాలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి మండువా శేషగిరిరావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.
ధర్మస్థాపన కోసమే
రామావతారం
హన్మకొండ కల్చరల్: ధర్మ స్థాపన కోసమే రామావతారమని వేయిస్తంభాల ఆలయంలో ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదోరోజు లక్ష పుష్పార్చన నిర్వహించారు. గురువారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్ రుద్రాభిషేకం నిర్వహించారు. యాగశాలలో సుదర్శనహోమం నిర్వహించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక
కేయూ క్యాంపస్ : జమ్మూ కశ్మీర్‌లోని కశ్మీర్ యూనివర్సిటీలో ఈ నెల 4నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్‌లిఫ్టింగ్ పోటీలకు పురుష, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య గురువారం తెలిపారు. పురుషుల జట్టులో పి.విశాల్, ఎం.అమన్, ఎ స్.పోతురాజు, వి.వెంకటేశ్, మహిళా జట్టులో సీహెచ్.రమ, బి.చిన్మయి, జి.శ్రుతి ఉన్నారు. కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఖమ్మం) ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జె.జేథ్యా మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు.
బార్‌షాపులకు
దరఖాస్తుల ఆహ్వానం
కాజీపేట అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు బార్లకు లైసెన్స్‌లు ఇవ్వనున్నట్లు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ (వరంగల్ అర్బన్) ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకై ్సజ్ కమిషనర్ హరికిరణ్ ఆదేశాల మేరకు గతంలో రెన్యువల్ కాకుండా మిగిలి పోయిన నాలుగు బార్లకు తిరిగి లైసెన్స్ జారీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 26లోపు ఆన్‌లైన్‌లో tgbcl. telangana.gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. లేదా సమీప ఎకై ్స జ్ స్టేషన్‌లో దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చునని సూచించారు. ఈనెల 29న కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి బార్‌లను కేటాయించనున్నట్లు తెలిపారు.
కాజీపేట జంక్షన్‌లో
ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ స్టేషన్‌ను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. నగరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ ఓనర్లు, డ్రైవర్లు ఇక్కడ తమ వాహనాలకు చార్జింగ్ పెట్టుకోవచ్చని సూచించారు. రైల్వే అధికారుల అనుమతితో ఇండో ఫాస్ట్ ఎనర్జీ కంపెనీ వారు ఈ స్వాప్ పాయింట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన యంత్రాలను కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ ప్రహరీ వద్ద భద్రపర్చినట్లు తెలిపారు. త్వరలో కాజీపేట జంక్షన్‌లో అధికారికంగా ప్రారంభించి వాహనదారులకు ఈచార్జింగ్ పాయింట్‌ను వినియోగంలోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
భద్రకాళి అమ్మవారికి కనకాంబరాలతో పుష్పార్చన


