వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Apr 6 2025 1:00 AM | Updated on Apr 6 2025 1:00 AM

వరంగల

వరంగల్‌

ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
రెన్యువల్‌ చేయక..

రామప్ప వైభవాన్ని చాటిచెప్పాలి

మిస్‌ వరల్డ్‌ టీమ్‌ అబ్బురపడేలా రామప్ప కళావైభవం చాటిచెప్పాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

8లోu

నర్సంపేట రూరల్‌: పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నర్సంపేటలో సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌) ఏర్పాటు చేసింది. ఆస్పత్రికి కావాల్సిన రెగ్యులర్‌ సిబ్బంది లేకపోవడంతో 15 సంవత్సరాల క్రితం ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 21 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురు రక్తనిధిలోని పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిని టీవీవీపీ (తెలంగాణ వైద్య విధాన పరిషత్‌) నుంచి డీఎంఈలో విలీనం చేశారు. మిగిలిన 15 మంది చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. వీరి కాంట్రాక్టు మార్చి 31తో ముగిసింది. సీహెచ్‌సీని ప్రభుత్వం జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి, వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఈక్రమంలో టీవీవీపీ నుంచి ఆస్పత్రిని డీఎంఈ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) పరిధిలోకి మార్చారు. టీవీవీపీ ఆధ్వర్యంలో కొనసాగిన ఏజెన్సీలు డీఎంఈ పరిధిలోకి రాకపోవడంతో మరో టీవీవీపీ ఆస్పత్రిలో ఈ సిబ్బందిని సర్దుబాటు చేయాల్సి ఉంది. జిల్లాలోనే వర్ధన్నపేట సీహెచ్‌సీ టీవీవీ పరిధిలో ఉంది. ఆ ఆస్పత్రిలో 15 మందికి సంబంధించిన పోస్టులు ఖాళీలు లేవు. రక్తనిధిలో పనిచేస్తున్న వారితో 15 మందిని డీఎంఈలో విలీనం చేస్తే అయిపోయేది. అలా చేయకపోవడంతో వారికి రెన్యువల్‌ చేసే అవకాశం లేకుండా పోయింది.

అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ

కార్మికుల ప్రదక్షిణ..

నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి పూర్తి బాధ్యతలను సూపరింటెండెంట్‌ నర్సింహస్వామి.. వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌, సూపరింటెండెంట్‌ కిషన్‌కు అప్పగించి డిప్యుటేషన్‌పై వర్ధన్నపేటకు వెళ్లిపోయారు. కానీ, 15 మంది సిబ్బంది పరిస్థితి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. వారి బాధ్యత డీఎంఈ అధికారులే చూసుకోవాలని టీవీవీపీ అధికారులు చెబుతున్నారు. టీవీవీపీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కాంట్రాక్ట్‌ అయిపోయిందని డీఎంఈ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని హనుమకొండలోని ఆయన నివాసంలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కలిసి సమస్య విన్నవించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు. కాగా, ఆస్పత్రిలో 180 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తొలుత మీకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారిని విధుల్లోకి తీసుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పుడు హామీ ఇచ్చారు. కానీ, ఆ పోస్టుల భర్తీలో అవకతవకలు జరగడంతో ఏజెన్సీనే ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆ నియామకాలు ఆగిపోయాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమను రెన్యువల్‌ చేయాలని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కోరుతున్నారు.

నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో మాట్లాడుతున్న కార్మికులు (ఫైల్‌)

న్యూస్‌రీల్‌

అయోమయంలో ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు

అరకొర వేతనాలతో 15 ఏళ్లుగా

నర్సంపేట సీహెచ్‌సీలో విధులు

విధుల్లోకి తీసుకోవాలని

ప్రభుత్వానికి విజ్ఞప్తి

వరంగల్‌1
1/1

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement