మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
నర్సంపేట: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన మహిళలకు రూ.11కోట్ల వడ్డీ లేని రుణాలు సోమవారం అందజేశారు. జిల్లాకు తొమ్మిది ఆర్టీసీ బస్సులు మంజూరు కాగా నర్సంపేట నియోజకవర్గంలో మంజూరైన ఆరు బస్సులు మండలానికి ఒకటి చొప్పున ప్రతీ మండల సమాఖ్యకు రూ.30లక్షల సబ్సిడీ చెక్కును అందించారు. చెన్నారావుపేట మండలంలోని అక్షయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి, ఖానాపురం భారతీయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30లక్షలు ఒక్కో సంఘానికి రూ.15లక్షల చెక్కును సంఘాల బాధ్యులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ 2004లో పావలా వడ్డీ రుణాలు మహిళలకు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి మహిళల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ రేణుకాదేవి, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డీపీఎంఓ దయాకర్, సరిత, అనిత, తదితరులు పాల్గొన్నారు.
సన్నబియ్యం భోజనం భేష్
ఖానాపురం: రేషన్ షాపుల్లో అందిస్తున్న సన్నబి య్యంతో వండిన భోజనం భేషుగ్గా ఉందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కితాబు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ మైనార్టీ సెల్ నాయకుడు ముస్తఫా నివాసంలో సన్నబియ్యంతో వండిన భోజ నాన్ని సోమవారం అధికారులతో కలిసి ఎమ్మె ల్యే ఆరగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులందరూ సన్నబియ్యం, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే
దొంతి మాధవరెడ్డి


