వారంలోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

వారంలోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

Apr 8 2025 6:57 AM | Updated on Apr 8 2025 6:57 AM

వారంలోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

వారంలోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

కలెక్టర్‌ ప్రావీణ్య

జిల్లాలోని అన్ని మండలాల పరిధి 150 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారంలోగా ప్రారంభించాలని కలెక్టర్‌ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ ప్రావీణ్య మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను తయారు చేసి వెంటనే అందించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగతా వాటిని కూడా వారంలోగా ప్రారంభించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు సంచులు సరిపడా నిల్వ ఉంచాలని, ధాన్యం కాంటాలు సరిగ్గా ఉన్నాయా లేదా? అని ముందే చూసుకోవాలన్నారు. ధాన్యంలో తేమశాతం లేకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద తేమశాతాన్ని కొలిచే మాయిశ్చరైజర్‌ మిషన్‌, టార్ఫాలిన్లు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో పేమెంట్స్‌ జరగాలన్నారు. క్రమపద్ధతిలో రైతులకు కూపన్లు అందజేయాలని, వాటి ప్రకారంగానే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఈసమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమురయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్‌సింగ్‌, అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి..

జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ ప్రావీణ్య.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, 2 బీహెచ్‌కే ఇళ్ల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పురోగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుక కూపన్లు అధికారులు అందజేయాలన్నారు. వారంలో మూడు రోజులు అధికారులు పర్యవేక్షించాలని, బేస్‌మెంట్‌ వరకు వచ్చిన వాటిని బిల్లుల చెల్లింపునకు పంపాలన్నారు. లబ్ధిదారులుగా ఉన్న పురుషుల కుటుంబాలకు చెందిన వాటిలో రేషన్‌కార్డులోని మహి ళల పేరును ఖరారు చేస్తూ జాబితా సమర్పించాలన్నారు. అదేవిధంగా యూడీఐడీ కార్డులు, చేయూత పెన్షన్లపై అధికారులతో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement