40 ఎకరాలు కౌలుకు తీసుకున్న..
10 సంవత్సరాలుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలు లీజుకు తీసుకుంటున్న. ఈ ఏడాది కూడా 13 ప్రాంతాల్లో రూ.5 లక్షలు వెచ్చించి 40 ఎకరాలను కౌలుకు తీసుకున్న. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న. మరో 10 రోజులు అయితే మామిడి కాయలు అమ్ముకుంటే రూ.6 లక్షలు వచ్చేవి. రెండు రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులకు 70 శాతం కాయ రాలిపోయింది. బుధవారం వరంగల్ మార్కెట్‌లో రాలిన కాయలను అమ్మితే రూ.50 వేలు వచ్చాయి. ఈసారి భారీగా నష్టపోయాను. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి. – గౌని నవీన్, మామిడి రైతు


