అభివృద్ధి దిశగా కేఎంటీపీ
సాక్షి, వరంగల్: సంగెం, గీసుకొండ మండలాల్లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ) అభివద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. చింతలపల్లి, శాయంపేట హవేలి గ్రామాల్లో సేకరించిన 1150 ఎకరాల్లో గణేశ్ ఎకోపేట్, గణేశ్ ఏకోటెక్ పరి శ్రమలు నిర్వహిస్తున్నాయి. కేరళకు చెందిన కై టెక్స్ వస్త్రపరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఇంకోవైపు దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్ కంపెనీ 8 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుంది. ఇలా ఓవైపు పరిశ్రమలు అందుబాటులోకి వస్తుంటే.. ఇంకోవైపు నిచేసే ఉద్యోగులతోపాటు అ క్కడి గ్రామస్తుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల,గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాల కోసం టీఎస్‌ఐఐసీ రూ.3,72,19,479తో టెండర్లు పిలిచింది. టెక్స్‌టైల్ పార్కు కోసం భూములిచ్చిన 863 మందికి స్టేట్ రిజర్వ్‌డ్ కోటా కింద గత నవంబర్‌లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అక్కడే ఒక్కొక్కరికి కేటాయించిన 100 గజాల ఓపెన్ ప్లాట్‌లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు రూ.ఐదు లక్షలు ఇస్తామని ఉత్తర్వులిచ్చింది.
సకల సౌకర్యాల దిశగా...
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని రాజీవ్‌గాంధీ టౌన్‌షిప్‌లో వసతుల కల్పనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీఎస్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి వ రంగల్ పర్యటనకు వచ్చిన సమయంలో మెగా టె క్స్‌టైల్ పార్కు కోసం భూమి ఇచ్చిన వారితోపాటు పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా పనులు మొదలు కానున్నాయి. ఏడాదిలోపు ఈ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, పిల్లల దుస్తులు తయారు చేయడంలోనే ప్రసిద్ధి చెందిన ౖకైటెక్స్ కంపెనీ 25,000 ఉద్యోగాల కోసం నియామక ప్రకటన ఇచ్చింది.
టెక్స్‌టైల్ పార్కులోని రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో వసతులు
రూ.3,72,19,479తో టెండర్లు పిలిచిన టీఎస్ ఐఐసీ అధికారులు
పీహెచ్‌సీ, ప్రైమరీ స్కూల్, జీపీ,
వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణం
త్వరలోనే పనులు
ప్రారంభించేందుకు కసరత్తు
అభివృద్ధి పనులు, మంజూరైన నిధుల వివరాలు..
పనులు నిధులు (రూపాయల్లో)
ప్రాథమిక పాఠశాల 1,82,05,658
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 1,14,42,650
గ్రామ పంచాయతీ కార్యాలయం 43,29,640,
పశువైద్యశాల భవనం 32,41,531


