సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం
వర్ధన్నపేట: సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మండలంలోని ఇల్లంద, దమ్మన్నపేట గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. అనంతరం దమ్మన్నపేట గ్రామంలో మేరుగు రాధిక–రమేశ్ ఇంటిలో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు దేవేందర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాను ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


