స్కూళ్లలో థర్డ్ పార్టీ సర్వే
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ‘థర్డ్ పార్టీ ’ ద్వారా సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. 2024–25 విద్యాసంవత్సరంలో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) ద్వారా ప్రతీ పాఠశాల నుంచి హెచ్‌ఎంల ద్వారా ఆన్‌లైన్‌లో పాఠశాలల్లోని అన్ని వివరాలను విద్యాశాఖ సేకరించింది. కాగా.. ప్రతీ పాఠశాలలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యతోపాటు మౌలిక వసతులు ఎలా ఉన్నాయనే వివరాలను థర్డ్ పార్టీ సర్వేలో పొందుపరుస్తున్నారు. ఇందులో తరగతి గదులు, టాయ్‌లెట్స్, కిచెన్ షెడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్లు, డిజిటల్ తరగతులు, ఫర్నిచర్ సదుపాయాలతోపాటు పాఠ్యపుస్తకాల పంపిణీ, స్కూల్ యూనిఫాం పంపిణీ వంటి అంశాలను నమోదు చేస్తున్నారు. 2024–25లో ప్రతీ పాఠశాల హెచ్‌ఎంల ద్వారా ప్రొఫార్మాలో స్కూల్ రిపోర్టును ఆన్‌లైన్‌లో విద్యాశాఖ సేకరించింది. దీంతో ఆయా పాఠశాలల సమగ్ర సమాచారం ఆస్కూల్ రిపోర్టు కార్డులో ఉంటుంది. ఈ సమాచారమంతా సక్రమంగా ఉందా.. లేదా? అనేది తెలుసుకునేందుకు ఈనెల 15న థర్డ్‌పార్టీ ద్వారా విద్యాశాఖ సర్వేను ప్రారంభించింది. నేడు (సోమవారం)తో సర్వే ముగియనుంది.
ఒక్కో విద్యార్థికి 10 పాఠశాలలు..
ప్రతీ జిల్లాలో ఒక్కో విద్యార్థి పది పాఠశాలల్లో సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో విద్యార్థి రోజుకు రెండు స్కూళ్లలో మాత్రమే సర్వే చేయాల్సి ఉంటుంది. సర్వే నిర్వహించాక స్కూల్ రిపోర్ట్ కార్డు కాపీని సంబంధిత హెచ్‌ఎంలకు, ప్రిన్సిపాళ్లకు అందజేస్తారు. ఆతర్వాత వివరాలను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు పంపిస్తారు. ఆ వివరాలను బట్టే కేంద్రం నుంచి రాష్ట్రంలోని సమగ్రశిక్షకు నిధులు (60 శాతం వరకు) అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం వరకు ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు, ఉపాధ్యాయుల శిక్షణలకు సంబంధించిన కార్యక్రమాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర శిక్ష నిధులు వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేటితో ముగింపు
వివరాల సేకరణలో ప్రభుత్వ డైట్,
బీఈడీ కళాశాల విద్యార్థులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
2,799 పాఠశాలల్లో నిర్వహణ
విద్యార్థులతో నిర్వహణ..
హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాల, ప్రభుత్వ బీఈడీ కాలేజీ విద్యార్థులు పాఠశాలల్లో థర్డ్ పార్టీ సర్వే చేస్త్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,979 పాఠశాలల్లో 299 మంది (డైట్, బీఈడీ కళాశాల) విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలో సర్వేను డి.వాసంతి, డీఈఓ కార్యాలయం ప్లానింగ్ కో–ఆర్డినేటర్ బి.మహేశ్ పర్యవేక్షిస్తూ సూచనలిస్తున్నారు.
సర్వే వివరాలివీ..
జిల్లా పేరు పాఠశాలల సర్వే చేస్తున్న
సంఖ్య విద్యార్థులు
హనుమకొండ 467 47
వరంగల్ 530 53
స్కూళ్లలో థర్డ్ పార్టీ సర్వే


