కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
వరంగల్: అకాల వర్షాల నేపథ్యంలో రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచాలని, ధాన్యం రాశి చుట్టూ గాటు తీసి తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై వివిధ శాఖల అధికారులకు వినతులు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావాలని ఆమె సూచించారు.
‘కొండా’ వర్గంలోకి
బీఆర్‌ఎస్ నాయకులు!
గీసుకొండ: మండలంలోని పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మంత్రి కొండా సురేఖ వర్గంలో చేరడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం వంచనగిరికి చెందిన బీఆర్‌ఎస్ ముఖ్యనాయకుడు ఒకరు కొండా మురళిని కలిసి కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను అండగా ఉంటానని, అవసరమైతే సదరు నాయకుడిని సర్పంచ్‌ను చేస్తానని మురళి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా శాయంపేటహవేలి, ఊకల్, ఎలుకుర్తి తదితర గ్రామాల బీఆర్‌ఎస్ నాయకులతోపాటు కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన పలువురు నాయకులు కొండా వర్గంలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
మతిస్థిమితం లేని
వ్యక్తి మృతి
నర్సంపేట రూరల్: మతిస్థిమితం లేని వ్యక్తి మృతిచెందిన సంఘటన నర్సంపేట పట్టణంలో జరిగింది. ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. ఖానాపురం మండలంలోని పెద్దమగడ్డకు చెందిన మచ్చిక రాజు (43)కు కొంతకాలం క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన నాలుగు నెలలకే భార్య వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయి తిరుగుతూ నర్సంపేటకు చేరుకున్నాడు. నర్సంపేట–మహబూ బాబాద్ ప్రధాన రహదారి సమీపంలో శని వారం రాత్రి పడిపోవడంతో స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. రాజును 108లో ఆస్పత్రి తీసుకెళ్లి వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి వీరస్వామి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పొదుపు సంఘాలు
ఐక్యతకు దోహదం
ఖిలా వరంగల్: పొదుపు సంఘాలు మన అభివృద్ధి, ఐక్యతకు దోహదం పడడంతోపాటు ఆపద సమయంలో ఆర్థికంగా అండగా ఉంటాయని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ అన్నారు. ఆదివారం వరంగల్ ఖుష్‌మహల్ సమీపాన సమ్మెట భద్రయ్యగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గౌడ ఉద్యోగుల సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సమ్మెట భద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బొమ్మెర కుమారస్వామి, కోశాధికారిగా తాళ్లపల్లి రమేశ్ నియమితులయ్యారు. కార్యక్రమంలో పులిసారంగపాణి, బార్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్, గుట్ట జీవన్‌గౌడ్, కత్తి సాంబయ్య, దయాకర్, భాస్కర్, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మెనూ ప్రకారం
భోజనం వడ్డించాలి
హసన్‌పర్తి: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి సూచించారు. ఎల్లాపురంలోని మహాత్మాజ్యోతి రావు పూలే గురుకుల పాఠశాలను ఆదివారం వెంకట్‌రెడ్డి తనిఖీ చేశా రు. వంట గదిలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న బ్యాక్‌లాగ్ ఎంట్రెన్స్ తీరును పరిశీలించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి


