
యూరియా
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ఊళ్లు దాటుతున్న
పరకాల: రాత్రింబవళ్లు క్యూలో నిలబడితే యూరి యా దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. నిద్రాహారాలు మాని.. క్యూలో నిలబడితే ఒక్క బస్తా దొరకడం కష్టం. అలాంటిది కొందరు వ్యవసాయ అధి కారులు మాత్రం తమ బంధువులకు ఇచ్చేందుకు యూరియాను వాహనాల్లో తరలిస్తున్నారు. ‘ఓ వైపు పరకాల నియోజకవర్గానికి కావాల్సిన యూరియా కోటా వచ్చేసింది. కానీ కొరత అంటూ అనవసరపు రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ పరకాల ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగుతున్నారు. మరోవైపు అధికారులను హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా పొరుగు జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ పరిధిలోని గ్రామాల రైతులకు (వ్యవసాయ అధికారుల బంధువులకు, అనుచరులకు) యూరియా తరలిస్తున్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనే ఓ సాక్ష్యమంటూ యూరియా అందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాగారం, పైడిపల్లి, లక్ష్మీపురం, వెంకటాపూర్, హైబోతుపల్లి గ్రామాల రైతులకు యూరియా పంపిణీ చేశారు. నాగారం గ్రామానికి చెందిన రైతులకు టోకెన్ ఇవ్వకుండా సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి బయటి వ్యక్తులకు టోకెన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు యూరియా దొరకని రైతులు టోకెన్లు తీసుకెళ్లిన వారిని వెంబడించారు. టోకెన్లు అందుకున్న వారు 10 యూరియా బస్తాలను నడికూడ మండల కేంద్రం మీదుగా శనిగరం గ్రామానికి తరలిస్తుండగా అడ్డగించి పట్టుకున్నారు. యూరియాను పక్కదోవ పట్టిస్తున్నారనే సమాచారంతో పరకాల పోలీసులు బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలంటూ రెండ్రోజులుగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అధికారులతో సమావేశమవుతున్నప్పటికీ కొందరు వ్యవసాయ అధికారులు యూరియా కొరత సృష్టిలో భాగం కావడం విశేషం.
క్యూలో చెప్పులు, ప్లాస్టిక్ బాటిళ్లు
శాయంపేట: గోదాముల వద్ద వివిధ గ్రామాల రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారని వ్యవసాయ శాఖ ఏఈఓలు తెలుపడంతో తెల్లవారుజాము నుంచే రైతులు చేరుకొని చెప్పులు, ప్లాస్టిక్ బాటిళ్లను క్యూలో పెట్టి పడిగాపులు కాశారు. పీఏసీఎస్ సిబ్బంది ఉదయం 8గంటలకు రావడంతో రైతులు అధిక సంఖ్యలో గుమిగూడడంతో తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న సీఐ రంజిత్ రావు, ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో చేరుకుని రైతులను క్యూలో పంపి యూరియా బస్తాలు పంపిణీ చేశారు.
రైతులు ఆందోళన చెందొద్దు: డీఏఓ
యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాం వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నానో యూరియా వాడడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. రైతుల అసవసరం మేరకు యూరియా పంపిణీ చేస్తామన్నారు. సహాయ వ్యవసాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి, టెక్నికల్ ఏఓ కమలాకర్, పరకాల ఏఓ శ్రీనివాస్, ఏఈఓ అర్చన, రైతులు ఉన్నారు.
వాహనాన్ని అడ్డగించిన రైతులు
వ్యవసాయ అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం

యూరియా

యూరియా

యూరియా