
జిల్లాలో భారీ వర్షం
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో సోమవారం సాయంత్రం తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. అక్కడక్కడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆటోమేటిక్ వెథర్ స్టేషన్‌లో రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ధర్మసాగర్‌లో 78 మిల్లీమీటర్లు, ఆత్మకూరులో 67.5, మడికొండలో 56.5, ఎల్కతుర్తిలో 51.3, భీమదేవరపల్లిలో 38, ఎల్కతుర్తిలో 32, ఐనవోలులో 31.5, కొండపర్తిలో 42.3, ఐనవోలులో 40.5, హనుమకొండ పెద్దమ్మగడ్డలో 32, శాయంపేటలో 27, దామెరలో 27.8, హసన్‌పర్తి మండలం నాగారంలో 16.3, చింతగట్టులో 32.8, పెద్ద పెండ్యాలలో 14.3, పరకాలలో 14.3, కమలాపూర్‌లో 9.5, నడికూడలో 9.3 వర్షం కురిసింది.