
పాడి గేదె.. ఎకరం భూమితో సమానం
● కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
గీసుకొండ: ఒక పాడి గేదె.. ఎకరం భూమితో సమానమని, దాని ద్వారా సుమారు రూ.1.25 లక్షల వరకు సంపాదించవచ్చని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కొనాయమాకుల రైతు వేదికలో గీసుకొండ, సంగెం, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన 124 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యుడు ప్రొఫెసర్ గాదె దయాకర్, గీసుకొండ, సంగెం, ఖిలా వరంగల్ మండలాల తహసీల్దార్లు ఎండీ.రియాజుద్దీన్, రాజ్‌కుమార్, ఇక్బాల్, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి ఇప్పటి వరకు 500 మందికిపైగా కల్యాణలక్ష్మి, శాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన దానికి గుర్తుగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి కేక్ కట్ చేశారు.