
జనరల్ తగ్గింది.. బీసీ పెరిగింది
సాక్షి, వరంగల్: 2011వ జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన ప్రకారం వరంగల్ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలకు ఐదు బీసీ, రెండు ఎస్టీ, రెండు ఎస్సీ, రెండు జనరల్ స్థానాల్లో ఐదు స్థానాలు మహిళలకు అధికారులు కేటాయించారు. 2019 ఎన్నికల రిజర్వేషన్లతో పోలిస్తే ఈసారి జెడ్పీటీసీ రిజర్వేషన్లలో నాలుగు జనరల్ స్థానాలు, ఒక ఎస్టీ రిజర్వేషన్ తగ్గగా, మూడు బీసీ స్థానాలు పెరిగాయి. గత ఎన్నికల్లో రిజర్వేషన్లు లేని ఎస్సీలకు ఈసారి రెండు ఎస్సీ స్థానాలు కేటాయించారు. జిల్లాలో 11 ఎంపీపీ స్థానాలకు ఐదు బీసీ, రెండు ఎస్టీ, రెండు జనరల్, రెండు ఎస్సీ స్థానాల్లో ఐదు స్థానాలు మహిళలకు కేటాయించారు. ఎంపీపీ రిజర్వేషన్లను గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నాలుగు జనరల్ స్థానాలు, ఒక ఎస్టీ స్థానం తగ్గగా, మూడు బీసీ స్థానాలు పెరిగాయి. ఈసారి ఎస్సీలకు రెండు స్థానాలు కేటాయించారు. మొత్తంగా బీసీ స్థానాలు పెరిగాయి.
జెడ్పీటీసీలో ఒక మహిళ స్థానం పెరిగింది
జెడ్పీటీసీ రిజర్వేషన్లను పరిశీలిస్తే 2019వ సంవత్సరంలో రెండు బీసీ స్థానాలు ఉంటే ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరిగింది. మూడు ఎస్టీలుంటే ఈసారి రెండు ఎస్టీలు, గతంలో రిజర్వేషన్ లేని ఎస్సీలకు ఈసారి రెండు ఎస్సీ స్థానాలు, అప్పుడు ఆరు జనరల్ స్థానాలుండగా ఈసారి రెండింటికి పరిమితమయ్యాయి. మహిళా రిజర్వేషన్ కోటా విషయంలో 2019లో నాలుగు మహిళా స్థానాలు రిజర్వ్ కాగా, మూడు జనరల్, ఒక ఎస్టీకి కేటాయించారు. ఈసారి ఐదు మహిళా స్థానాలు రిజర్వ్ కాగా, రెండు బీసీలకు, జనరల్, ఎస్టీ, ఎస్సీలకు ఒక్కోస్థానం కేటాయించారు.
మహిళలకు తగ్గిన ఎంపీపీ స్థానాలు
ఎంపీపీ రిజర్వేషన్లను పరిశీలిస్తే 2019వ సంవత్సరంలో రెండు బీసీ స్థానాలుంటే ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరిగింది. మూడు ఎస్టీలుంటే ఈసారి రెండు, గతంలో రిజర్వేషన్లు లేని ఎస్సీలకు ఈసారి రెండు ఎస్సీ స్థానాలు, అప్పుడు ఆరు జనరల్ స్థానాలుంటే ఈసారి రెండు జనరల్ స్థానాలకు పరిమితమైంది. మహిళా రిజర్వేషన్ కోటాలో 2019లో ఆరు మహిళా స్థానాలు ఉండగా మూడు జనరల్, రెండు బీసీ, ఒక ఎస్టీకి కేటాయించారు. ఈసారి ఒకటి తగ్గి ఐదు స్థానాలు కేటాయించగా రెండు బీసీ, జనరల్, ఎస్టీ, ఎస్సీలకు ఒక్కో స్థానం కేటాయించారు. అంటే గతంలో మూడు జనరల్ మహిళ స్థానాలుండగా ఈసారి ఒక్క దాంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వరంగల్ జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయించారు.
జిల్లా జెడ్పీ ప్రకారమే రిజర్వేషన్లు
2019లో జెడ్పీ ఎన్నికలు జరిగిన సమయంలో వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉండేవి. ఆ సమయంలో వరంగల్ రూరల్ జిల్లాలో పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాలు ఉన్నాయి. 2021 ఆగస్టులో వరంగల్ రూరల్ జిల్లా కాస్త వరంగల్ జిల్లాగా మారింది. వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ జిల్లాగా మారిన సమయంలో వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాలు కలిశాయి. అయినా, జెడ్పీ వరంగల్ రూరల్ జిల్లాగానే కొనసాగింది. జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత 2024, నవంబర్ 27న జీఓఎంఎస్ నంబరు 68 ప్రకారం వరంగల్ రూరల్‌ను వరంగల్ జిల్లా జెడ్పీగా, వరంగల్ అర్బన్‌ను హనుమకొండ జిల్లా జెడ్పీగా ఏరా్పాటుచేశారు. దీంతో ఆయా జిల్లాల్లో ఉన్న సందిగ్ధతకు తెరపడినట్లైంది. దాని ప్రకారమే ఇప్పుడు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.
2019తో పోల్చుకుంటే ఈసారి
జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లలో మార్పు
అప్పుడు ఆరు జనరల్ స్థానాలుంటే, ఇప్పుడు రెండే స్థానాలు
జెడ్పీటీసీలో ఒక మహిళ స్థానం పెరగగా, ఎంపీపీలో తగ్గింది
రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో కేటాయించిన అధికారులు
వరంగల్ రూరల్ జెడ్పీ నుంచి వరంగల్ జెడ్పీగా ఏర్పాటు
వరంగల్ జెడ్పీ చైర్మన్ స్థానం
ఎస్టీ జనరల్
జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల వివరాలు
మండలం 2019 2025
చెన్నారావుపేట ఎస్టీ జనరల్ జనరల్ మహిళ
దుగ్గొండి బీసీ జనరల్ జనరల్
ఖానాపురం జనరల్ మహిళ ఎస్టీ జనరల్
నల్లబెల్లి జనరల్ మహిళ బీసీ జనరల్
నర్సంపేట జనరల్ మహిళ ఎస్టీ మహిళ
నెక్కొండ ఎస్టీ మహిళ బీసీ జనరల్
వర్ధన్నపేట జనరల్ ఎస్సీ మహిళ
పర్వతగిరి ఎస్టీ జనరల్ బీసీ జనరల్
రాయపర్తి జనరల్ బీసీ మహిళ
సంగెం బీసీ జనరల్ బీసీ మహిళ
గీసుకొండ జనరల్ ఎస్సీ జనరల్
ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు
మండలం 2019 2025
చెన్నారావుపేట ఎస్టీ జనరల్ జనరల్ మహిళ
దుగ్గొండి బీసీ మహిళ జనరల్
గీసుకొండ జనరల్ మహిళ ఎస్సీ జనరల్
ఖానాపురం జనరల్ ఎస్టీ మహిళ
నల్లబెల్లి బీసీ మహిళ బీసీ జనరల్
నర్సంపేట జనరల్ మహిళ ఎస్టీ జనరల్
నెక్కొండ ఎస్టీ జనరల్ బీసీ మహిళ
వర్ధన్నపేట జనరల్ ఎస్సీ మహిళ
పర్వతగిరి ఎస్టీ మహిళ బీసీ జనరల్
రాయపర్తి జనరల్ బీసీ మహిళ
సంగెం జనరల్ మహిళ బీసీ జనరల్

జనరల్ తగ్గింది.. బీసీ పెరిగింది