నేటినుంచి జోనల్‌స్థాయి క్రీడాపోటీలు
రాయపర్తి: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో గురువారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు 11వ జోనల్‌స్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్.సరిత తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం క్రీడాప్రాంగణాన్ని పరిశీలించి మాట్లాడారు. క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు 14 పాఠశాలల నుంచి 1,190 మంది విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నట్లు తెలిపారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాల్‌బ్యాడ్మింన్, టెన్నికాయిట్, చెస్, క్యారం, అథ్లెటిక్స్ క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్‌ఓ విద్యారాణి, డీసీఓ అపర్ణ హాజరుకానున్నట్లు ఆమె వివరించారు.


