రిజర్వేషన్ల పోరాటాన్ని విస్తరిస్తాం
● బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్
● నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద జేఏసీ నాయకుల మౌనదీక్ష
నర్సంపేట: బీసీ జేఏసీ రిజర్వేషన్ల పోరాటాన్ని పల్లెపల్లెకు విస్తరిస్తామని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే మద్దతు ఇచ్చిన బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్లు కడారి సురేశ్‌యాదవ్, కురిమిల్ల రమేశ్, కోచైర్మన్లు చిలువేరు కొమ్మాలు, ఓర్సు సాంబయ్య, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య, దుగ్గొండి మండల అధ్యక్షుడు కానుగుల కుమారస్వామి, నాయకులు నూనె రంజిత్, మారపాకర రమేశ్, శీరంశెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


