కళారంగంలో హేలాపురి కళకళలు | - | Sakshi
Sakshi News home page

కళారంగంలో హేలాపురి కళకళలు

Apr 12 2025 6:44 PM | Updated on Apr 12 2025 6:44 PM

కళారం

కళారంగంలో హేలాపురి కళకళలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కళారంగానికి సంబంధించి ఏలూరుకు ఘనమైన కీర్తి ఉంది. ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఈ ప్రాంతానికి గొప్ప గుర్తింపు తీసుకువచ్చారు. ఏలూరు అంటేనే కళలకు కాణాచి అని జాతీయ స్థాయిలో చెప్పుకునేటంత ప్రఖ్యాతి ఈ ప్రాంతానికి ఎంతోమంది కళాకారుల ద్వారా వచ్చింది. సంగీతం, నాటకం, నృత్యం ఇలా ఆయా రంగాల్లో ఏలూరుకు చెందిన కళాకారులు విదేశాల్లో సైతం ప్రదర్శినలిచ్చి అక్కడి ప్రజలను ఉర్రూతలూగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటువంటి ఏలూరుపై 2025వ సంవత్సరంలో కళారత్న (హంస)అవార్డులు గుంపులుగా వాలాయి.

హేలాపురి కీర్తి కిరీటంలో కళారత్నాలు

కళా సాంస్కృతిక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో హంస అవార్డు అత్యున్నతమైనదిగా కళాకారులు భావిస్తారు. ఈ అవార్డు రావాలంటే 64 కళల్లో ఏదో ఒక కళలో విశేషమైన కృషి, సేవ చేసి ఉండాలి. అలాగని ఎవరికిపడితే వారికి ఇచ్చే అవార్డు కాదిది. 64 కళల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంతో కొంతమంది తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. అలాంటి వారి పోటీని ఎదుర్కొని ఈ అవార్డు సాధించడం గొప్ప ఘనతగానే గుర్తించాలి. అంతటి ఘనతను ఏలూరుకు చెందిన ముగ్గురు కళాకారులు ఈ ఏడాది ఉగాది నాడు అవార్డులు అందుకుని హేలాపురి కీర్తి కిరీటంలో కళారత్నాలుగా నిలిచారు. సినీ, నాటక రంగాల్లో చేసిన కృషికిగానూ ఎస్‌వీ రామారావు, కూచిపూడి నృత్య రంగంలో చేసిన కృషికి గానూ ఎ.పార్వతి రామచంద్రన్‌, హరికథాగాన రంగంలో సప్పా భారతికి అవార్డులు వచ్చాయి.

ఏలూరులో ఒకే ఏడాది ముగ్గురికి కళారత్న అవార్డులు

లలిత కళల్లో చేసిన సేవలకు ప్రభుత్వ గుర్తింపు

కళారంగంలో హేలాపురి కళకళలు 1
1/2

కళారంగంలో హేలాపురి కళకళలు

కళారంగంలో హేలాపురి కళకళలు 2
2/2

కళారంగంలో హేలాపురి కళకళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement