ఇంటర్ ఫలితాల్లో మాంటిస్సోరి ప్రతిభ
తణుకు అర్బన్: ఇంటర్ ఫలితాల్లో మాంటిస్సోరీ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు తెలిపారు. ఫస్టియర్ బైపీసీలె ఎ.లావణ్య 435 మార్కులు, ఎంపీసీలో పీఎస్‌వీ సూర్యనారాయణ 464, టి.హరి నాగేంద్రనాధ్ 464, ఎం.అజన్య నిస్సి 463, జె.వైష్ణవి ప్రణీత 463 సాధించినట్లు వివరించారు. శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు.
సాంకేతికతలో రైతులకు సాయపడాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వ్యవసాయ రంగంలో అందివస్తున్న అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుగా వ్యవసాయ అధికారులు అవగాహన చేసుకుని అనంతరం ఆ సాంకేతికతను రైతులకు అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ ఎంవీ శేషారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శేషారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ అధికారుల సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా, వారి హక్కులను పరిరక్షించడం కోసమే తమ సంఘం పని చేస్తోందని స్పష్టం చేశారు. అసోసియేషన్‌కు సంబంధించి ఇటీవల ఖాళీ అయిన ప్రధాన కార్యదర్శి స్థానానికి జిల్లాలోని కొయ్యలగూడెంకు చెందిన బోడపూడి సోమశేఖర్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపయ్య నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు బత్తిన రంగనాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు .
ఇంటర్ ఫలితాల్లో మాంటిస్సోరి ప్రతిభ
ఇంటర్ ఫలితాల్లో మాంటిస్సోరి ప్రతిభ


