రొయ్యకు సిండికాటు | - | Sakshi
Sakshi News home page

రొయ్యకు సిండికాటు

Apr 13 2025 1:13 AM | Updated on Apr 13 2025 1:13 AM

రొయ్య

రొయ్యకు సిండికాటు

పోటెత్తిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రం శనివారం భక్తులు, పెళ్లి జనాలతో పోటెత్తింది. క్షేత్రంలోని అన్ని విభాగాలూ భక్తులతో కిటకిటలాడాయి. 8లో u

ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

భీమవరం: రొయ్య రైతుల కష్టాన్ని ఆక్వా సిండికేట్‌ అడ్డగోలుగా దోచేస్తోంది. అమెరికా సుంకాలు పెంచేసిందంటూ పది రోజుల క్రితం ఎక్స్‌పోర్టర్స్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, మీడియేటర్స్‌ క్షణాల్లో రొయ్య ధరలను అమాంతం తగ్గించేశారు. మూడు నెలల పాటు పన్నుల పెంపు లేదని అమెరికా స్పష్టం చేసినా తగ్గించిన ధరలు పెంచకుండా రైతుల కష్టాన్ని కొల్లగొడుతున్నారు.

జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో..

జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా దీనిలో వనామీ విస్తీర్ణం 70 వేల వరకు ఉంటుంది. దాదాపు 30 వేల మందికి పైగా రైతులు రొయ్యల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వలన రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో పెద్ద మొత్తంలో రొయ్యలు మార్కెట్‌లోకి వస్తుంటాయి. ఏటా సీజన్‌లో సుమారు 500 టన్నుల వరకు రొయ్యలు అమెరికా, చైనా, యూరప్‌ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒడిదుడుకుల కోర్చి రైతులు పండించిన పంటను ఎగుమతిదారులు, ఫీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యాజమాన్యాలు, మధ్యవర్తులు ఏకమై కొల్లగొడుతున్నారు.

టారిఫ్‌లు సాకుగా..

నెల రోజుల క్రితం 100 కౌంట్‌ రొయ్యల ధర కిలో రూ.260 వరకు ఉండగా మార్కెట్‌లోకి రొయ్యలు ఎక్కువగా వస్తుండటంతో రూ.230కి తగ్గించేశారు. జిల్లావ్యాప్తంగా రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలపడంతో రూ.240కి పెంచిన విషయం తెలిసిందే. దేశీయ ఉత్పత్తులపై సుంకాలను 26 శాతం పెంచుతున్నట్టు ఈనెల 3న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడాన్ని సాకుగా చూపించి మరలా ధరలు తగ్గించేశారు. కిలోకు 50 కౌంట్‌లోపు రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి అవు తుండగా.. 60 కౌంట్‌ నుంచి 100 కౌంట్‌ వరకు చైనా, యూరప్‌ దేశాలకు వెళుతుంటాయి. అమెరికా పన్నుల ప్రభావమంటూ అన్ని కౌంట్లలోనూ రూ.50 నుంచి రూ.90 తగ్గించేసి కొనుగోళ్లు చేయడంతో రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగా నష్టపోవాల్సి వచ్చింది.

కిలో రూ.100 వరకు ధరలు తగ్గించి..

గత 10 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రొయ్యలపై దిగుమతి సుంకం 26 శాతం పెంచుతున్నట్టు ప్రకటించిన వెంటనే ఇక్కడ ఎగుమతిదారులు రూ.50 నుంచి రూ.100 వరకు ధరలు తగ్గించేశారు. వివిధ దేశాధినేతల ఒత్తిడి మేరకు మళ్లీ ట్రంప్‌ ఇప్పట్లో సుంకాలు పెంచబోమని ప్రకటించినా ఇక్కడి ఎగుమతిదారులు ధరలు పెంచకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడులు పెట్టలేక.. పట్టుబడులు పట్టలేక..

వారం రోజులుగా రొయ్య ధరలు తగ్గిపోవడంతో మళ్లీ పెరుగుతాయని భావించి రైతులు తమ చెరువుల్లోని రొయ్యలు పట్టుబడులు చేయకుండా నిరీక్షిస్తున్నారు. దీంతో రోజుకు పెద్ద మొత్తంలో ఫీడ్‌, ఇతర మందులకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యువతి ఆత్మహత్య

ప్రేమించి మోసం చేయడంతో ఏలూరులో నర్సుగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుందని, న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు ధర్నా చేశారు. 8లో u

దళారుల రాజ్యం

రొయ్యల సాగులో ఎకరాకు రూ.4 లక్షలకు పైగా పెట్టుబడులు అవుతున్నాయి. రైతుల వద్ద నుంచి పట్టుబడి రొయ్యలు ఎగుమతిదారులు వద్దకు చేరుకోవడానికి ముగ్గురు మధ్యవర్తులను దాటి వెళ్లాల్సి వస్తుంది. ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఎగుమతిదారుల వద్ద ఏౖమైతే రొయ్య కొరతలు ఉన్నాయో వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులకు సమాచారం పంపుతారు. ఉదాహరణకు ఎగుమతులుదారుల వద్ద 100 కౌంట్‌ కిలో రూ.235 ధర ఉంటే వ్యాపారుల నుంచి ప్రాసెసింగ్‌ యూనిట్లు రూ.220 కొనుగోలు చేస్తాయి. వీళ్లు 5 టన్నులకు పైగా ఉంటేనే కొంటారు. అయితే వ్యాపా రులు మాత్రం రైతుల వద్ద నుంచి రూ.190కి మాత్రమే కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు టన్నుకు రూ.45 వేల వరకు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కల్పించుకుని ధాన్యం మాదిరిగా రొయ్యలను కొనుగోలు చేయాలి. రొయ్యల కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మార్కెట్‌లో గిట్టుబాటు ధర కల్పించాలి.

న్యూస్‌రీల్‌

పోరాటాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం

ఈనెల 9న ఉండిలో అప్సడా వైస్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిర్వహించే సమావేశాన్ని కూటమి నేతలు అడ్డుకున్నారు. రొయ్య రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వ పరువు, ప్రతిష్టలు అభాసుపా లవుతాయని తలచి అసోసియేషన్‌ నాయకులను, రైతులను కూటమి నాయకులు బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. మళ్లీ ఆదివారం ఉండిలో కోట్ల ఫంక్షన్‌ హాలులో రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. అయితే ఈ సమావేశంలో రైతులు రొయ్యల ధరల గురించి మాట్లాడకుండా ఫీడ్‌ ధరలు, విద్యుత్‌ సబ్సిడీ వంటి అంశాలు మాత్రమే ప్రస్తావించేలా పథకం రచించినట్టు తెలిసింది. కూటమి నాయకుల కనుసన్నల్లో నిర్వహించే ఆక్వా రైతుల సమావేశం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని పలువురు పెదవి విరుస్తున్నారు.

ఇదేందిరొయ్యో

రైతులను దోచేస్తున్న వ్యాపారులు

అమెరికా సుంకాల పేరిట భారీగా ధరల తగ్గింపు

కిలోకు కౌంట్‌ను బట్టి రూ.50 నుంచి రూ.90 వరకు కోత

ఇప్పట్లో సుంకాలు లేవంటున్న అగ్రరాజ్యం

అయినా ధరలు పెంచని వ్యాపారులు

తీవ్రంగా నష్టపోతున్న రైతులు

ధరలు నిలకడగా ఉండేలా చూడాలి

రొయ్యల ధరల పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. అమెరికా పన్నుల పేరుతో ఆ దేశానికి ఎగుమతి కాని కౌంట్‌ రొయ్యలకు కూడా దళారులు ధర తగ్గించి రైతులను నష్టాల ఊబిలోకి తోస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కంటితుడుపు చర్యలు కాకుండా రొయ్యల ధరలు నిలకడగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి.

– పెనుమాల నర్సింహస్వామి, ఆక్వా రైతు, గొల్లవానితిప్ప

మొక్కుబడి సమావేశాలు వృథా

కూటమి నాయకులు రైతులతో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వారం రోజులుగా రొయ్యల ధరలు భారీగా పతనమై రైతులు నష్టపోతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం. రైతులు, రొయ్యల కొనుగోలుదారులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటుచేయాలి.

– నాగరాజు వెంకట గోపాలకృష్ణంరాజు, ఆక్వా రైతు, కొణితివాడ

రొయ్యకు సిండికాటు 1
1/5

రొయ్యకు సిండికాటు

రొయ్యకు సిండికాటు 2
2/5

రొయ్యకు సిండికాటు

రొయ్యకు సిండికాటు 3
3/5

రొయ్యకు సిండికాటు

రొయ్యకు సిండికాటు 4
4/5

రొయ్యకు సిండికాటు

రొయ్యకు సిండికాటు 5
5/5

రొయ్యకు సిండికాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement