అన్ని వర్గాలకూ ఆరాధ్యుడు అంబేడ్కర్
శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు
పెనుగొండ : దేశంలో అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఆరాధ్యుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. ఆదివారం ఆచంటలో సర్పంచ్ కోట సరోజని ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ప్రతిఒక్కరూ జయంతి వేడుకలు నిర్వహించే ఏకై క మహానేత, ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు నినాదంతో అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించి భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా చరిత్రలో నిలవాలన్నారు. వైఎస్సార్ సీపీ యువనేత చెరుకువాడ నరసింహరాజు(నరేష్) మాట్లాడుతూ అంంబేడ్కర్ అందరివాడన్నారు. యువకులంతా అంబేడ్కర్ చూపిన మార్గం చదువులో ముందుండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సరిళ్ల పురుషోత్తం, మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, మాల సంఘాల రాష్ట్ర కన్వీనర్ గుమ్మాపు సూర్యవరప్రసాద్, బండి సుందర రామమూర్తి, జిల్లేళ్ల సత్య సుధామా, యాదాల రవిచంద్ర, ఆచంట మండల జేఏసీ కన్వీనర్ కోట వెంకటేశ్వరరావు, బీరా మధు తదితరులు పాల్గొన్నారు.


