సమష్టిగా కృషి చేయాలి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసే దిశగా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బీ.శ్రీలత అన్నారు. మంగళవారం ఏలూరులోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో జిల్లాలోని ఎకై ్సజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీలత మాట్లాడుతూ జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత పెండింగ్‌లోని కేసులపై విచారణ పూర్తిచేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. కేసులు పెట్టినా మారకుంటే పీడీ యాక్ట్ ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ కేవీఎం ప్రభుకుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఏ.అవులయ్య, ఏఈ ఎస్.అజయ్‌కుమార్ సింగ్, పాండురంగారావు ఉన్నారు.
ఆటో బోల్తా.. 9 మందికి స్వల్ప గాయాలు
నూజివీడు: మీర్జాపురంలో ఆటో బోల్తా పడి మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం గొల్లపల్లికి చెందిన మహిళలు మంగళవారం సీతారామపురం వద్ద ఉన్న సమోసా తయారీ ఫ్యాక్టరీలోకి పనికి వెళ్లి సాయంత్రం తిరిగి ఆటోలో ఇంటికి వస్తుండగా మీర్జాపురం వద్దకు వచ్చే సరికి క్రేన్ తగిలి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. వీరందరిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత


