యర్రంపేట వాసికి గిన్నిస్ బుక్‌లో చోటు
కొయ్యలగూడెం: యర్రంపేటకు చెందిన కీబోర్డ్ కళాకారుడు జీవన్ ప్రసాద్ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాడు. మంగళవారం ఆ వివరాలకు విలేకరులకు వెల్లడించారు. హాలెల్ అంతర్జాతీయ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో పద్దెనిమిది దేశాలకు చెందిన కీబోర్డ్ కళాకారులతో ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లో కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. గంటసేపు అంతరాయం లేకుండా ప్లేచేస్తూ నైపుణ్యత కనబరిచిన 1046 మందిని విజేతలుగా ప్రకటించారన్నారు. విజేతల్లో తాను ఉన్నానని, ఈ నేపథ్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేశారన్నారు. గిన్నిస్ అద్జిడికేటర్ రిచర్డ్ స్టిన్నింగ్ అవార్డులను హైదరాబాదులో ప్రదానం చేసినట్లు చెప్పారు.
‘అక్కడ అమ్మాయి– ఇక్కడ అబ్బాయి’ చిత్ర బృందం సందడి
భీమవరం: భీమవరం ఏవీజీ సినిమాస్‌లో ‘అక్కడ అమ్మాయి– ఇక్కడ అబ్బాయి’ చిత్ర బృందం మంగళవారం సందడి చేసింది. హీరో ప్రదీప్, హీరోయిన్ దీపిక పిల్లి యూనిట్ సభ్యులతో ప్రేక్షకులతో మాట్లాడారు. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు వాయిదా
ఏలూరు రూరల్ / టౌన్: ఈ నెల 17, 18 తేదీల్లో ఆశ్రం వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్, అండర్–23, అండర్–19 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు వాయిదా వేసినట్లు ఉమ్మడి ప శ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్‌న్ అధ్యక్షుడు జి ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు ఓ ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఈ పోటీలు వాయిదా వేశామని, తదుపరి తేదీలను పత్రికల ద్వారా ప్రకటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్‌పై వచ్చిన పలు ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించిందని కమిటీ చైర్మన్ చవాకుల కాశీ విశ్వేశ్వరరావు మరో ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిబంధనలు పాటించకపోవటంతో వెస్ట్‌గోదావరి డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఏవిధమైన కార్యకలాపాలు నిర్వహించకుండా నిలుపుదల చేశారని పేర్కొన్నారు.
వేతన బకాయిలు విడుదల చేయాలి
భీమడోలు: ఉపాధి కార్మికులకు రెండు నెలలుగా రావాల్సిన వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అన్నారు. భీమడోలు సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండీఎం నిర్వాహకులకు రెండు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చిరుద్యోగులు, కూలీల వేతన బకాయిలను నెలల తరబడి పెండింగ్ పెట్టడం దారుణమన్నారు.
యర్రంపేట వాసికి గిన్నిస్ బుక్‌లో చోటు


