చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పరిశీలన
ఉంగుటూరు: ప్రజలు ఎవరి ఇంట్లో చెత్తను వారే ఎరువులు తయారు చేసుకునేలా పంచాయతీ సిబ్బంది అవగాహన కల్పించాలని స్వచ్ఛాంధ్ర రాష్ట్ర కమిషనర్ డాక్టర్ బి.అర్జునరావు అన్నారు. గురువారం ఉంగుటూరు గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్న చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు చెత్త సేకరణలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం 17వ స్థానానికి పడిపోయిందన్నారు. తిరిగి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలంటే అధికారులతో పాటు నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారు సింధు, ఎంపీడీఓ రాజ్‌మనోజ్, ఈఓపీఆర్‌డీ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


