తప్పులు లేకుండా ఓటర్ల చేర్పులు, మార్పులు
కలెక్టర్ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు క్లయిమ్స్ పరిష్కార ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. టీడీపీకి చెందిన మరపట్ల శ్యాంబాబు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు నమోదులో డబుల్ ఎంట్రీలు ఉన్నాయని అన్నారు. ఆరు నెలల డేటాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 14,70,886 మంది ఉండగా, పురుషులు 7,20,613 మంది, మహిళలు 7,50,197 మంది, ట్రాన్స్‌జెండర్లు 77 మంది ఉన్నారన్నారు. ఫారం–6 ఓటు నమోదుకు 906 మంది ద రఖాస్తు చేసుకోగా 741 పరిష్కరించామని, 73 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫారం–8 మా ర్పులు, చేర్పులకు 2,491 క్లయిమ్స్‌కు 2,135 పరిష్కరించగా 125 తిరస్కరించామని, 232 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కలెక్టరేట్ ఇన్‌చార్జి ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, యు.చంద్రశేఖర్ (టీడీపీ), జై.శివ (జనసేన), కామన నాగేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ), ఎం.రామాంజనేయులు (సీపీఎం), ఎం.రత్నరాజు (బీఎస్పీ) పాల్గొన్నారు.


